ధర్మవరపు సుబ్రమణ్యం కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా?
TeluguStop.com
ధర్మవరపు సుబ్రమణ్యం.తెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే కమెడియన్.
ఆయన కామెడీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.తన కామెడీ టైమింగ్, నోటి నుంచి వచ్చే పంచులు పటాసుల్లా పేలిపోయేవి.
తన కామెడీ టైమింగ్ మూలంగానే టాలీవుడ్ లో నిలదొక్కుకోగలిగాడు.ధర్మవరపు సుబ్రమణ్యం ముందుగా వెండితెరపై కాకుండా.
బుల్లి తెర మీద తన సత్తా చాటుకున్నారు.ఆ తర్వాతే సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.
ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగారు ధర్మవరపు సుబ్రమణ్యం.తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి.
రోజు రోజుకు ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది.సినిమాల్లో నటించేందు కోసం ఆయన మద్రాసుకు పారిపోయాడు.
అక్కడ కొంత కాలం పాటు సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగాడు.అయినా తనకు అవకాశాలు రాలేదు.
తిరిగి ఇంటికి వచ్చు.చిన్నప్పటి నుంచి చదువుల్లో టాప్ గా కొనసాగిన ఆయన.
పబ్లిక్ సర్వీష్ కమిషన్ పరీక్షలు రాశాడు.పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం సంపాదించాడు.
ఓ వైపు ఉద్యోగం చేస్తున్నా.నటనపై తనకున్న ఇష్టాన్ని ఏనాడూ వదులుకోలేదు.
"""/"/
వెండితెరపై అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ ధర్మవరపు సుబ్రమణ్యం.చివరకు టీవీరంగంలో అడుగు పెట్టాడు.
అక్కడ పలు నాటికల్లో నటించి మంచి పేరు పొందాడు.ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చాడు.
అప్పుడు తన సత్తా చాటుకున్నాడు.అద్భుతమైన నటనతో చక్కటి కమెడియన్ గా గుర్తింపు పొందాడు.
సినిమా రంగానికి తను చేసిన సేవలకు గాను ఎన్నో ప్రశంసలు పొందాడు.అవార్డులు, రివార్డులు అందుకున్నాడు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి.ఇక ధర్మవరపు సుబ్రమణ్యానికి ఇద్దరు కొడుకులు.
వారికి సినిమా రంగంపై ఇష్టం లేదు.అందుకే పలు వ్యాపారాలు చేస్తున్నారు.
బిజినెస్ మ్యాన్లుగా రాణిస్తున్నారు.పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి చక్కటి జీవితాన్నని లీడ్ చేస్తున్నారు.
బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత