భజన ఎందుకు చేయాలి? ఏం వస్తుంది?

భజన ఎందుకు చేయాలి? ఏం వస్తుంది?

ఏదైనా పండుగలు పబ్బాలప్పుడు చాలా మంది భజనలు చేస్తుంటారు.ఏ గుడికి వెళ్లినా వారంలో ఏదో ఒక రోజు భజన మండలి వారు భజన చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు.

భజన ఎందుకు చేయాలి? ఏం వస్తుంది?

అసలు భజన ఎందుకు చేస్తారు? అలా చేయడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.

భజన ఎందుకు చేయాలి? ఏం వస్తుంది?

భగవంతున్ని కీర్తించేందుకు, స్మరించేందుకు చాలా మార్గాలున్నాయి.గుడికి వెళ్లడం, నమస్కరించడం, శ్లోకాలు చదవడం, ప్రార్థనలు చేయడంలాగే భజన కూడా భక్తిని తెలిపేందుకు ఒక మార్గం.

పది మంది కలిసి గుడిలో లేదా ప్రశాంతమైన వాతావరణంలో దేవుడిని స్మరిస్తూ.పాడే పాటలను భజనగా పిలుస్తుంటారు.

"""/" / భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయని ప్రతీతి.సామూహికంగా భగవంతుడి నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుందట.

పది మందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతున్ని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.

అలసటను మరచిపోయి నూతన ఉత్తేజం పొంది ఉత్సాహవంతులమవుతామట.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.

భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది.గుండె పనితీరు మెరుగుపడుతుంది.

దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది.రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.అంతేకాదండోయ్.

భజన వల్ల ముక్తి, పుణ్యం కూడా కల్గుతుంది.గుడికి వెళ్తూ పూజ చేస్తే వచ్చే పుణ్యం భజనలో పాల్గొన్నా.

వారు పాడుతున్న పాటలు విన్నా కల్గుతుందని చెబుతుంటారు పెద్దలు.

సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటన ఎలా ఉండబోతుంది…