హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుకు టీఆర్ఎస్ వేసిన మూడు వ్యూహాలు ఇవే?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం రాజకీయంగా హీటెక్కుతోంది.ప్రస్తుతం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఎలాగైతే రాజకీయ వాతావరణం వేడెక్కిందో ప్రస్తుతం అదే రీతిలో పెద్ద ఎత్తున రకరకాల ట్విస్ట్ లతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం కూడా ఉన్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ లతో పోలిస్తే టీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక గెలుపు చాలా ప్రతిష్టాత్మకమైనదన్న విషయం తెలిసిందే.

ఆయితే గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కంచుకోటగా ఉంటూ వస్తున్న హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది.

"""/"/ అందుకే సరిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కెసీఆర్ వేసిన ఈ మూడు వ్యూహాలతో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే మొదటగా దళిత బంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసేలా ఆ తరహా వాతావరణాన్ని ఇతర ప్రతిపక్షాలు తప్పు పట్టేలా తయారు చేయడం, ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించటం, ఆ తరువాత హుజూరాబాద్ బహిరంగ సభ ఇలా మూడింటితో ప్రతిపక్షాల విమర్శలను చాలా బలంగా తిప్పికొట్టే అవకాశం ఉంది.

దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ అనుకూల వాతావరణం అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే అవకాశం వందకు వంద శాతం ఉంది.

మరి ఈ మూడు వ్యూహాలు కనుక ఖచ్చితంగా ఇతర పార్టీలపై ప్రభావం చూపితే మాత్రం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపూ చాలా సునాయాసంగా ఉండే అవకాశం ఉంది.

మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఒకే నెలలో తారక్, చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?