పిల్ల‌ల్లో మ‌లేరియాని గుర్తించ‌డం ఎలా..? క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏంటీ..?

ప్రస్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో అత్య‌ధికంగా విజృంభించే వ్యాధుల్లో మ‌లేరియా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

ఇది ధోమ‌ల ద్వారా వ్యాపించే వ్యాధి అని అంద‌రికీ తెలుసు.కానీ, మ‌లేరియా ల‌క్ష‌ణాలు ఏంటీ.

? అన్న దానిపై అవ‌గాహ‌న ఉండ‌దు.ముఖ్యంగా పిల్ల‌ల్లో మ‌లేరియాని గుర్తించ‌డం ఎలా.

? అస‌లు వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏంటీ.? వంటి విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.

అయితే మ‌లేరియా బారిన ప‌డిన‌ప్పుడు పిల్ల‌ల్లో కొన్ని ల‌క్ష‌ణాలు కామ‌న్‌గా క‌నిపిస్తాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌లేరియా వ‌చ్చిన వెంట‌నే పిల్ల‌ల్లో మొద‌ట క‌నిపించే ల‌క్ష‌నాలు జ్వ‌రం, తీవ్ర‌మైన చ‌లి.

వాతావ‌ర‌ణం ఎంత వేడిగా చ‌లి విప‌రీతం ఉంటుంది.జ్వరం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

పిల్ల‌ల్లో త‌ల నొప్పి ఎప్పుడో గాని ఉండ‌దు.కానీ, మ‌లేరియా సోకితే మాత్రం త‌ల నొప్పి చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

మలేరియా వచ్చిన పిల్ల‌ల్లో కనిపించే మరో ప్రధాన లక్షణం విప‌రీత‌మైన చెమ‌ట‌లు.మంచి గాలి వీస్తున్న ప్ర‌దేశంలో కూర్చున్నా తెగ చెమ‌ట‌లు ప‌ట్టేస్తుంటాయి """/"/ అలాగే మ‌లేరియా సోకిన పిల్ల‌ల్లో పొత్తి కడుపు నొప్పి, వికారం, త‌ర‌చూ వాంతులు అవ్వ‌డం, అతిసారం, ఆక‌లి పూర్తిగా త‌గ్గి పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అంతేకాదు, మేకంగా అని పించ‌డం, నీర‌సం ఉండ‌టం, అల‌స‌ట‌, ఆయాసం, కండరాలు నొప్పి, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, డీ హైడ్రేషన్‌, గుండె వేగంగా కొట్టు కోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు సైతం క‌నిపిస్తాయి.

పిల్ల‌ల్లో ఈ ల‌క్షణాలు ఉంటే గనుక త‌ల్లి దండ్రులు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వారిని డాక్టర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి స‌రైన ట్రీట్‌మెంట్ అందించాలి.

లేట్ చేసే కొద్ది వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.మ‌రియు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 .

అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన లాభం లేదా… ప్రతివారం అలా చేయాల్సిందేనా?