"""/" /
ఆందోళన, దూకుడు, తొందర పాటు, విసుగు, అసమర్థత, గుండెల్లో దడ, ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం, కోపం వంటివి కూడా డిప్రెషన్ లక్షణాలుగానే చెప్పుకోవచ్చు.
డిప్రెషన్ కు గురైన వారు అస్సలు పడుకోలేకపోతుంటారు.లేదా ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు.
ఏ పనిపైనా ఆసక్తి చూపరు.ప్రతి విషయాన్ని మరచిపోతుంటారు.
అంతేకాదు, డిప్రెషన్‌లో ఉన్న వారికి ఆకలి ఉండదు.ఒకవేళ ఉన్నా వేళకు ఆహారం తీసుకోరు.
దాంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.కాబట్టి, పైన చెప్పిన లక్షణాలు మీలో ఉంటే గనుక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంచి మానసిక వైద్యుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి.
లేదంటే డిప్రెషన్‌లో కూరుకుపోయి ఒక్కోసారి ప్రాణాలను తీసుకునే స్టేజ్ వారకు వెళ్లిపోతారు.