వామ్మో.. ఒంటికి వ్యాయామం లేకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ ఆరోగ్యమైన జీవనశైలిని కోరుకుంటున్నారు.హెల్తీ గా ఫిట్ గా ఉండటం కోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.
కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకుంటున్నారు.అయితే ఆరోగ్యమైన జీవితానికి పోషకాహారం, నిద్ర ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం.
ఒంటికి వ్యాయామం లేకుంటే అనేక సమస్యలు చుట్టుపడతాయి.వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాలు క్రమంగా బలహీన పడతాయి.
దాంతో తరచూ నీరసంగా అనిపిస్తుంది.చురుకుదనం లోపిస్తుంది.
అలాగే ఒంటికి వ్యాయామం లేకుంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్( Heart Disease, Stroke ) మరియు ఇతర సమస్యలు తలెత్తుతాయి.
వ్యాయామం చెయ్యకపోవడం వల్ల నిద్ర విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటారు.పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం, నిద్రలో ఆటంకాలు వంటివి ఇబ్బంది పడతాయి.
"""/" /
శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే ముఖ్యమైన దుష్ప్రభావాలలో బరువు పెరగడం ఒకటి.
మన శరీరాలను తగినంతగా కదిలించనప్పుడు, మనం తక్కువ కేలరీలను బర్న్ చేస్తాము.దాంతో అదనపు కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడతాయి.
కాలక్రమేణా ఇది ఊబకాయానికి దారితీస్తుంది. """/" /
మెదడు ఆరోగ్యం కూడా వ్యాయామంతో ముడిపడి ఉంది.
ఒంటికి వ్యాయామం లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచన శక్తి దెబ్బతింటాయి.అంతేకాదు వ్యాయామం చేయకపోవడం కారణంగా మధుమేహం, గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
ఎముకలు వీక్ గా మారతాయి.కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.
ఆరోగ్యకరమైన జీవనశైలి లో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం.బరువు నిర్వహణ, మెరుగైన మానసిక స్థితి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను వ్యాయామం ద్వారా పొందొచ్చు.
అందువల్ల రోజుకు కనీసం ఇరవై నిమిషాలైనా ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
దారుణం: గ్రైండర్లో చొక్కా ఇరుక్కుపోవడంతో 19 ఏళ్ల యువకుడు మృతి!