పెరుగు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.. పెరుగు ఎవరు తినకూడదు అంటే..

భారతీయ వంటకాలలో పెరుగు అత్యంత ప్రజాదరణ పొందిన ఆహా పదార్థమని కచ్చితంగా చెప్పవచ్చు.

ఇందులో కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి 12, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

పెరుగులో అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.దీనిని రోజుకు ఒక గిన్నె తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రతిరోజు పెరుగు తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎవరి మీద ఎక్కువగా ఉంటాయంటే, బలహీనమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉన్నట్లయితే మీరు ఎక్కువగా పెరుగు తినడం మానుకోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"""/" / ఇది మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది.ముఖ్యంగా మహిళలలో పెరుగు లోని ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది.

అంతేకాకుండా ఇది దీర్ఘకాలిక మంట, హృదయ సంబంధ వ్యాధులు, ఎముకల పెళుసు దనానికి దారి తీసే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే పెరుగులో అధిక శాతం కొవ్వు ఉంటుంది.పెరుగుని మరీ ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

పాల నుంచి తీసుకోబడిన ఆహారాలలో అధిక స్థాయి సంతృప్తి కొవ్వులు ఉంటాయి.పెరుగును ఎక్కువగా ఆహారంలో తీసుకున్నట్లయితే """/" / ఇది ఎముకల సాంద్రతను బలహీనపరుస్తుంది.

దీని ఫలితంగా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో పెరుగుతూ దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ఎందుకంటే ఇది గ్రంధి స్రావాన్ని పెంచుతుంది.దీనితోపాటు శ్లేష్మ స్రావాన్ని కూడా పెంచుతుంది.

అంతేకాకుండా ఉబ్బసం, దగ్గు, జలుబు బాధితులు, అలాగే ఇతర శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారు రాత్రిపూట పెరుగును అసలు తినకూడదు.

నిపుణులు అభిప్రాయం ప్రకారం పెరుగును పగటిపూట, మధ్యాహ్న సమయంలో తినడం మంచిది.పెరుగు వీలైనంత తక్కువగా తినాలి.

అనుకున్నదే జరిగింది.. T20లో 300 కొట్టేశారు..