ఓకే బాటలో రేవంత్, లోకేష్.. వారి డైరీల వెనక రహస్యాలేంటి..?

ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాల్లోకి రానటువంటి చంద్రబాబు కొడుకు లోకేష్(Nara Lokesh) ఈ మధ్యకాలంలో పాదయాత్రల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు.

ఎలాగైనా రాబోవు ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.సభలు పెడుతూ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YCP) తప్పులను ఎత్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే వారి పాదయాత్రలకు మరియు ఇతర బహిరంగ సభలకు పోలీసులు అడ్డుపడుతున్నారని వేదిక ముఖంగా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఈ తరుణంలో పోలీసులకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.కట్ చేస్తే.

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాస్త ఊపు పెరిగింది.

ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కూడా పెరిగిపోయాయి.ఎలాగైనా రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ ని( Congress ) గద్దెనెక్కించాలని అనేక ప్రయత్నాలు, సభలు పెడుతూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి.

ఈయన కూడా సభలు సమావేశాలు పెట్టిన సమయంలో పోలీస్ లు అడ్డుపడుతున్నారని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు.

"""/" / అటు ఏపీలో టిడిపి(TDP) నాయకుడు లోకేష్, ఇక్కడ కాంగ్రెస్ అధినాయకుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే తరహాలో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

అది ఎలాగయ్యా అంటే.ఒక సభా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ నా దగ్గర ఎర్ర బుక్కు ఉందని ఇందులో ఉన్న పేరు ఎవరిదో తెలుసా చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి(SP Rishanth Reddy) నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను అకారణంగా అడ్డుకున్నాడని అన్నారు.

ఏమయ్యా రిశాంత్ రెడ్డి బంగారు పాలెంలో నీకు ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా, నేను ఎవరిని వదిలిపెట్టనని, ఏ అధికారులు అయితే చట్టాల్ని ఉల్లంఘిస్తూ, """/" / మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వారిపై అధికారంలోకి వచ్చాక ఎంక్వయిరీ చేయిస్తానని, మీ బండారం బయటపెడతానని హెచ్చరించారు.

అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒక వేదికపై మాట్లాడుతూ మహబూబ్ నగర్ పోలీసులకు ఒకటే చెబుతున్న డైరీలో ( Diary ) మీ పేరు రాసి పెట్టుకున్నామని, 100 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చి ఒక్కొక్కరి బండారం బయట పెడతామని, గుడ్డలు ఊడదీస్తామని హెచ్చరించారు.

ఇలా ఇద్దరు నాయకులు ఒకే విధంగా పోలీసులను హెచ్చరిస్తూ డైరీలో రాసుకున్నామని మాట్లాడడంతో చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. చరణ్ కు టైం అస్సలు బాలేదా?