ఆలయానికి ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్లి ఏదైనా బలమైన కోరికను కోరి ఆ కోరిక నెరవేరితే స్వామివారికి ఎంతో విలువైన కానుకలను సమర్పిస్తామని దేవునికి ప్రార్థిస్తాము.

ఈ క్రమంలోనే ఎవరు స్తోమతకి తగ్గట్టుగా వారు స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటారు.

అదేవిధంగా మన గ్రామంలో ఏదైనా కొత్త గుడి నిర్మాణం చేపడితే చాలామంది గుడికి ఏదో ఒక విధమైన కానుకలు సమర్పించడం మనం చూస్తుంటాము.

ఈ క్రమంలోనే కొందరు స్వామి వారికి వెండి, బంగారు ఆభరణాలను దానం చేయగా మరికొందరు ఆలయానికి సంబంధించి నటువంటి గంటలు, పూజా సామాగ్రి వంటి తదితర వస్తువులను దానం చేస్తుంటారు.

అయితే ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం ఏదైనా కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు ఆలయ గోడలకు సున్నం వేయడం, గుడి ముందు ముగ్గులు వేయడం, ఆలయ ప్రాంగణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచటం వల్ల విష్ణులోక ప్రాప్తి వంటి పుణ్య ఫలాలు దొరుకుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే కొందరు ఆలయానికి శంఖం దానం చేస్తారు.ఈ విధంగా శంఖం దానం చేయడం వల్ల విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది.

మరి కొందరు గంటలు దానం చేస్తారు.గంట దానం చేయడం వల్ల గొప్ప కీర్తిని పొందుతాడు.

మరికొందరు ఆలయానికి వచ్చిన భక్తులకు చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మిస్తారు.

ఈ విధంగా పందిర్లు నిర్మించడం వల్ల ధర్మబుద్ధి కలుగుతుంది.జెండా దానం చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు.

ఆలయానికి అద్దం దానం చేయటం వల్ల మంచి రూపం లభిస్తే.బంగారం, వెండి ఇతర లోహాలను దానం చేసిన వారు పుణ్య ఫలాన్ని పొందుతారు.

దేవుడు పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను దానం చేయటం వల్ల స్వామివారికి హోమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన కేసీఆర్..!