చేతికి ఉన్న వేళ్లలో ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా..?
TeluguStop.com
బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారంగా వస్తోంది.మహిళలు తమ తమ భర్తల క్షేమం కోసం, వారు సౌభాగ్యంగా ఉండాలని బొట్టు పెట్టుకుంటారు.
భక్తులు పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు.దేవాలయాల్లో దైవాన్ని దర్శించుకునేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు.
అయితే ఇందులో మరీ ముఖ్యంగా శివ భక్తులు బూడిదను ధరిస్తే, విష్ణు భక్తులు నామాన్ని ధరిస్తారు.
కానీ ఏదైనా బొట్టు కిందే వ్యవహరించబడుతుంది.ఇక పెద్దలు ఆశీర్వదిస్తూ కూడా కొన్ని సందర్భాల్లో బొట్టు పెడతారు.
ఈ క్రమంలోనే బొట్టు పెట్టుకునేందుకు చాలా మంది కుడిచేతి ఉంగరం వేలునే వాడతారు.
అయితే మీకు తెలుసా.? అదే కాదు.
ఇతర వేళ్లతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు.మరి ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా.