అధిక కొలెస్ట్రాల్ వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌లేంటి.. కొలెస్ట్రాల్‌ను ఎలా త‌గ్గించుకోవాలి?

ప్ర‌స్తుత రోజుల్లో ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ తో( Cholesterol ) బాధ‌ప‌డ‌తున్నారు.

అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయకపోవడం, ధూమ‌పానం, అధిక బ‌రువు, మితిమీరి మద్యం సేవించడం, డయాబెటిస్ త‌దిత‌ర అంశాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెర‌గ‌డానికి కార‌ణం అవుతాయి.

థైరాయిడ్ హార్మోన్ల లోపం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కార‌ణం ఏదేనా కూడా అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌రం.ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే గుండె సంబంధిత వ్యాధులుకు( Heart Diseases ) కారణమవుతుంది.

అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోయి.రక్త ప్రసరణ క్షీణించుతుంది.

ఇది గుండె పోటుకు దారితీస్తుంది.అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు సన్నగా మార‌తాయి.

దీని వ‌ల్ల రక్త ప్రసరణ కోసం గుండె ఎక్కువ శ్రమ పడుతుంది, ఇది రక్తపోటును పెంచుతుంది.

"""/" / మ‌ధుమేహం( Diabetes ) ఉన్నవారిలో అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని భారీగా పెంచేస్తుంది.

అలాగే అధిక కొలెస్ట్రాల్ వల్ల గాల్‌స్టోన్లు ఏర్పడే అవకాశముంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అధిక కొలెస్ట్రాల్ కొంద‌రిలో ధమనులను పూర్తిగా బ్లాక్ చేస్తుంది.దాంతో బ్రెయిన్ కు రక్తప్రసరణ ఆగిపోయి స్ట్రోక్ కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంటుంది.

అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. """/" / అయితే కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం కీలకమైన పాత్ర పోషిస్తాయి.

తాజా పండ్లు, కూర‌గ‌యాలు, ఆకుకూర‌లు మ‌రియు ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలి.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేప‌లు, అవిసె గింజల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే వెన్న, పాలు, చీజ్ వంటి ఆహారాల‌ను, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన పదార్థాలను ఎవైడ్ చేయాలి.

చక్కెర అధికంగా ఉన్న పానీయాలు మరియు డెజర్ట్‌లను తీసుకోవ‌డం తగ్గించుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అల‌వాటు చేసుకోవాలి.

శ‌రీర బ‌రువును అదుపులోకి తెచ్చుకోవాలి.ధూమ‌పానం, మ‌ద్య‌పానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.

రెగ్యుల‌ర్ గా ఒక క‌ప్పు గ్రీన్ టీను తీసుకోవాలి.మ‌రియు తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి.

పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయిన కూడా సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా..?