దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ ప్లాన్ ఎవ్వరూ ఉహించలేనిది?

యావత్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్( Directed Rajamouli , Trivikram ) స్థానం చాలా ప్రత్యేకమైనది.

ఒకరు వందల కోట్ల పెట్టుబడితో బడా సినిమాలు తెరకెక్కిస్తే, మరొకరు ఓ మాదిరి డబ్బుతోనే బడా సినిమా స్థాయి సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.

అందుకే ఈ ఇద్దరి సినిమా వస్తుందంటే చాలు.సినిమా ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.

మరీ ముఖ్యంగా ఫలానా హీరోతో వీరు సినిమా ఎనౌన్స్ చేస్తే చాలు, సదరు హీరోల అభిమానులు ఆయా దర్శకుల సినిమా అప్డేట్స్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు.

ప్రస్తుతం జనాల పరిస్థితి అలాగే ఉంది. """/" / కుటుంబ కథా చిత్రాల దర్శకుడు అనిపించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' సినిమా( 'Guntur Karam' Movie ) తరువాత మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు.

ఈయన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) కోసం మరో కథను తయారు చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

కానీ వీటిపైన అఫీషియల్ అనౌన్సుమెంట్ అనేది ఇంత వరకు రాలేదు.దాంతో ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు, మరోవైపు పవన్ అభిమానులు గురూజీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండగా, పవన్ పెండింగులో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

"""/" / ఇక జక్కన్న రాజమౌళి పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది.

ఘట్టమనేని అభిమానులు అయితే జక్కన్న అప్డేట్ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి.ఎందుకంటే రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో సినిమాని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు పూర్తవుతోంది.

అప్పటినుండి ఒక్క అప్డేట్ కూడా జక్కన్న నుండి రాకపోవడం కొసమెరుపు.దాంతో మహేష్ అభిమానులు ఒకింత అసహనంగా ఉన్నా, దర్శక ధీరుడు ఏదోఒకరోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఖుషి చేస్తాడని ఊహల్లో తేలుతున్నారు.

ఈ తరుణంలో ఈ ఇద్దరి దర్శకుల నుండి రాబోతున్న సంక్రాంతికి దిమ్మతిరిగే అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

అవేవో తెలియాలంటే ఇంకా మనం 2 నెలల పాటు వేచి చూడాల్సిందే.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters