పంచ క్రియలు అనగానేమి? కచ్చితంగా వీటిని అందరూ చేయాలా?

పంచ క్రియలు అంటే.మనం నిత్య జీవితంలో చేసే కొన్ని క్రియలు.

అవి కూడా దేవుడికి సంబంధించినవి.అంటే పూజలు, పనుస్కారాలు వంటివన్న మాట.

అయితే ప్రతీ మనిషి వీటిని కచ్చితంగా పాటించాలని చాలా మంది పెద్దలు చెబుతుంటారు.

అయితే అసలు ఆ పంచ క్రియలు ఏవి.వాటి వల్ల ఉఫయోగం ఏమిటి అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఉపాసన పూజ గదిలో గానీ, ఆలయంలో గానీ దేవుడిని ప్రార్థించడం.

భక్తితో క్రమ శిక్షణతో ఆచార వ్యవహారాలు నిర్వహిస్తూ దైవారాధన చేయడం.దీన్నే ఉపాసన అంటారు.

2 ఉత్సవం.కుటుంబంతో కలిసి పండుగలు, వేడుకలు జరిపించటం, ఉప వాసాది క్రియలలో పాలు పంచుకోవడం, నియమానుసారం ఆలయాలకు వెళ్లడాన్ని ఉత్సవం అంటారు.

3.అహింసా విధానంఇతరుల యోగ క్షేమాలు ఆలోచించే నిస్వార్థ జీవన విధానం, మానసికంగాను, శారీరకంగాను, ఇతరులను హింసించని ‘అహింసా విధానం’తో కూడిన కర్మ బద్ధ జీవనం.

4.తీర్థ యాత్రలు.

ప్రాపంచిక పరమయిన విషయ ఆలోచనలు వదలి పెట్టి, వీలును బట్టి తీర్థ యాత్రలు సాగిస్తూ, భగవంతుని, గురువులనూ సందర్శిస్తూ వైరాగ్య విధానాన్ని అల వాటు చేసుకోవటం.

5.సంస్కారం.

పురుడు, నామ కరణం, కర్ణ భూషణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, మరణం.ఇలా అనేక సమయాలలో ఆచరించే హైందవ ఆచార వ్యవహారాలను సక్రమంగా నిర్వహించటం.

వీటినే సంస్కారం అంటారు.అయితే ఈ ఐదు క్రియలను మనిషి తన జీవితంలో కచ్చితంగా పాటిస్తాడు.

ముఖ్యంగా హిందువులు వీటిని పూర్తి చేస్తుంటారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!