బ‌రువు త‌గ్గించే ప‌సుపు పాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!!

పాలు, ప‌సుపు ఈ రెండు విడివిడిగా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే.

శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పాల‌లో ఉంటాయి.కాల్షియం, పాస్పరస్‌తో పాటు సూర్య‌ర‌ష్మి నుంచి వ‌చ్చే విటమిన్ డి కూడా పాల ద్వారా పొందొచ్చు.

ఇక ప‌సుపు విష‌యానికి వ‌స్తే.ఇందులో ఉండే యాంటి ఫంగల్ , యాంటి వైరల్ గుణాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి.

మ‌రియు ఎన్నో భ‌యంక‌ర రోగాల నివారిణిగా ప‌సుపు ప‌నిచేస్తుంది.అయితే పాలు, ప‌సుపు క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప‌సుపు పాలు ప‌ర‌గ‌డుపున తాగితే మంచి ఫ‌లితాలు పొందొచ్చు.

బ‌రువు త‌గ్గేవ‌ర‌కు లేదంటే పొట్ట ద‌గ్గర కొవ్వు క‌రిగే వ‌ర‌కు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌వ‌చ్చు.

ఇక ప‌సుపు పాలు తాగ‌డం వ‌ల్ల బరువు తగ్గడమేకాకుండా అనేక ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

"""/"/ ప్ర‌తిరోజు ప‌సుపు పాలు తాగితే.కీళ్ళనోప్పులు, మెడ నోప్పి, నడుము నోప్పి, కండరాల నోప్పులు వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే జ‌లుబు, ద‌గ్గు, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు ఒక క‌ప్పు ప‌సుపు పాలు తాగితే త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ప‌సుపు పాలు రోగాల‌తో పోరాడే రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది.అదేవిధంగా, నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారు ప్ర‌తిరోజు రాత్రి ఒక గ్లాసు ప‌సుపు పాలు తాగితే.

మంచిగా నిద్ర ప‌డుతుంది.డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వల్ల‌.

శరీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అదే స‌మ‌యంలో గుండె జ‌బ్బుల‌ను సైతం దారిచేర‌కుండా చేస్తుంది.

TDP Janasena BJP : మూడు పార్టీల ఉమ్మడి మీటింగ్… తీసుకున్న నిర్ణయాలు ఇవే