జొన్నలు తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
TeluguStop.com
జొన్నలు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
ఏ వయస్సు వారైనా జొన్నలు తినొచ్చు.ఎంతో రుచిగా ఉండే జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అందుకే జొన్నలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు.జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.
మరి జొన్నలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందని అన్నది ఇప్పడు తెలుసుకుందాం.మధుమేహం సమస్యతో బాధపడేవారికి జొన్నలు బెస్ట్ ఫుడ్.
అందుకే రైస్‌కు బదులు జొన్నల రైస్ తీసుకుంటే.షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
జొన్నల్లో ఉండే పీచు పదార్థాలు జీర్ణసమస్యలు తొలగించి.మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
జొన్నలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
"""/" /
అధిక బరువుతో బాధపడేవారు జొన్నలను డైట్లో చేర్చుకుంటే.ఇందులో ఉండే ప్రొటీన్లు, పైబర్ శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయి.
శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ జొన్నలు సహాయపడతాయి.గర్భవతులు కూడా జొన్నలు తీసుకోవడం వల్ల.
ఇందులో ఉండే ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి.ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నల్లో ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటుంది.
అందుకే రక్తహీనత సమస్యతో బాధపడేవారు జొన్నలను డైట్ చేర్చుకోమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే జొన్నల్లో పాస్పరస్, మాంగనీస్, కాపర్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్.. అంతా ఏఐ మహిమ..!