ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
TeluguStop.com
తులసి చాలా పవిత్రమైనది.తులసికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది.
హిందూ మతంలో చాలామంది వారి వారి ఇళ్ళలో ప్రతిరోజు తులసి మొక్కను పూజ చేస్తారు.
ఎందుకంటే తులసిను లక్ష్మీదేవిలా కొలుస్తారు.అయితే తులసికి మతపరంగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
తులసి ఒక ఆంటీ బయోటిక్ తులసి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ప్రతిరోజు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
ఈ రోజుల్లో చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు.అందుకే వాళ్ళు తులసి ఆకులను తింటే ఎంతో మేలు చేస్తాయి.
అయితే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.అదేవిధంగా జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుంది.
ఇక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వాళ్లకు కూడా తులసి ఆకు ఈ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది.
ప్రధానంగా తులసి ఆకులు ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
అదే విధంగా తులసి ఆకు ఖాళీ కడుపుతో తింటే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఎందుకంటే తులసిలో ఆంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. """/"/
అందువల్ల ఈ తులసిని తరుచుగా తీసుకుంటే గుండె సమస్యలు ఏవి దరికి రావు అలాగే తులసి ఆకులో ఉండే పొటాషియం, ఫోలేట్ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది ఎముకలను బలంగా మార్చుతాయి.అదేవిధంగా తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించవచ్చు.
అదే విధంగా ప్రతిరోజు వాతావరణం ప్రకారం వచ్చే జలుబు లాంటి దగ్గు ఇలాంటి చిన్న చిన్న జబ్బులను నయం చేస్తుంది.
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచిదని కూడా చాలామంది ప్రజలు భావిస్తారు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..