పాల‌ల్లో సోంపు క‌లిపి ఆ టైమ్‌లో తాగితే ఎన్ని లాభాలో!

భోజ‌నం చేశాక సోంపు తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.క‌డుపు నిండా భోజ‌నం తిన్నాక కొద్దిగా సోంపును తీసుకుంటే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంద‌ని అలా చేస్తుంటారు.

అయితే సోంపు మ‌రెన్నో ఆరోగ్య లాభాల‌ను కూడా అందిస్తుంది.ఫెన్నెల్ సీడ్స్ అని పిలుచుకునే సోంపులో ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌తో పాటు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా సోంపు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అందులోనూ గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో పావు టేబుల్ స్పూన్ సోంపు పొడి, రుచికి స‌రిప‌డా బెల్లం పొడి క‌లిపి రాత్రి నిద్రించ‌డానికి గంట లేదా అర‌గంట ముందు తీసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు గ‌నుక చేస్తే నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.

అలాగే ర‌క్త‌హీన‌త‌తో బాధ ప‌డే వారు సోంపును పైన చెప్పిన విధంగా పాల‌ల్లో క‌లిపి సేవించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి స‌రిప‌డా ఐర‌న్ అందుతుంది.ఫ‌లితంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.

"""/" / రాత్రుళ్లు నిద్రించే ముందు పాల‌ల్లో సోంపును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల‌.

దానిలో ఉండే పాలీఫెన‌ల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటివి ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

అంతేకాదు.గోరు వెచ్చ‌ని పాలల్లో సోంపును యాడ్ చేసి నైట్ నిద్రించే ముందు తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

నోటి పూత స‌మ‌స్య ఉంటే.దాని నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

శ‌రీరంలో అధిక వేడి తొల‌గిపోతుంది.దంప‌తుల్లో లైంగిక స‌మ‌స్య‌లు త‌గ్గి సంతానోత్పత్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది.

మ‌రియు ర‌క్త‌పోటు సైతం అదుపులో ఉంటుంది.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!