మంచి చెడు శకునాలపై శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసా..?
TeluguStop.com
భారతీయ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి( Jyotishya Shastram ) ఎంతో ప్రాధాన్యత ఉంది.
మన జీవితంలో జరిగే సంఘటనలను శకునాలు అనే అంటారని పండితులు చెబుతున్నారు.కానీ అవి వ్యతిరేకంగా ఉంటాయి.
కొన్ని శకునాలు విచిత్రంగా కూడా ఉంటాయి.మరి కొన్ని శకునాలు మనకు ఆనందంతో పాటు సంపాదన కూడా ఇస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అలాగే కొన్ని శకునాలు మంచి ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు.కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి.
చాలామంది వాటిని పట్టించుకోరు.అలాంటి వాటిని శకునాలు అని అంటారు.
కొన్ని శకునాలు చెడును సూచిస్తే మరికొన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. """/" /
అలాగే పండితులు చెప్పిన వివరాల ప్రకారం శుభప్రదంగా భావించే శకునాలు ఇవే.
మీకు స్వప్నంలో( Dream ) భగవంతుడు కనిపిస్తే చాలా మంచిది.ఇది శుభ శకునంగా వేదాలలో చెబుతారు.
అలాగే కలలో గణేషుడు( Ganesha ) కనిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి సమస్యలు రాకుండా పూర్తి అవుతాయి.
కొన్ని ముఖ్యమైన పనులకు వెళ్లే దారిలో నెమలి ( Peacock ) కనిపిస్తే మంచి శుభ సూచకంగా చెబుతారు.
నెమలి నృత్యం చేస్తూ కనిపిస్తే అంత విజయమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.కొన్ని కలలు చాలా భిన్నంగా ఉంటాయి.
కలలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళ కనిపిస్తే అది కూడా మంచి సూచకంగా భావిస్తారు.
"""/" /
మీకు ఇలాంటి కల వస్తే ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
మీ జేబులో ఉన్న నోటు లేదా నాణెం పడిపోతే అది కూడా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు.
ఇలా జరిగితే త్వరలో మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.మీరు ఎటైనా వెళ్లేటప్పుడు థర్డ్ జెండర్స్( Third Genders ) కనిపిస్తే కచ్చితంగా వారికి డబ్బులు ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది.
ఒక్క రూపాయి అయినా సరే వారి వద్ద నుంచి తీసుకొని విలువైన నాణెంగా ఉంచుకోవడం చాలా శుభం అని పండితులు చెబుతున్నారు.