Volkswagen : వోక్స్‌వ్యాగన్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

వోక్స్‌వ్యాగన్( Volkswagen ) నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు భారత దేశంలో విడుదల ఎందుకు సిద్ధమైంది.

ID.4 పేరుతో వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు విడుదల అవ్వనుంది.

ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్, బ్యాటరీ ప్యాక్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ కారు ఈ కారు డిజైన్ విషయానికి వస్తే.

VM లోగో తో కూడిన స్టైలిష్ గ్రిల్, కూల్ బానెట్, ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్, LED టైయిల్ లైట్లు, 3డీ క్లస్టర్ డిజైన్, స్కిడ్ ప్లేట్లు,21- అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు వస్తుంది.

"""/" / ఈ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్( Dual All Wheel Drive Setup ) ను కలిగి ఉంది.

82kWh బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే, ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

కారు పవర్ ట్రెయిన్ సెటప్ 299hp శక్తిని, 499Nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు గరిష్టంగా ఒక గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.కేవలం 6 సెకండ్లలో 0 నుండి 100kmph వేగాన్ని అందుకో గలదు.

"""/" / ఈ ఎలక్ట్రిక్ కారు మిగతా ఫీచర్ల విషయానికొస్తే.పనో రమిక్ సన్ రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు( Pano Ramic Sun Roof, Powered Front Seats ), యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్ స్త్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనేక కనెక్టివిటీ ఆప్షన్లతో కూడిన 10- అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ ప్యానెల్ తో ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు SUV సింగిల్ మోటర్, రియల్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటర్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో సహా అనేక పవర్ ట్రైన్ ఎంపికలతో వస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు ధర వివరాలు, లాంచింగ్ వివరాలు కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

కొడుకుకు నామకరణం చేసిన బిగ్ బాస్ మానస్.. ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!