భోజనం ఇలా చేస్తే బరువు పెరగడం ఖాయం.. జాగ్రత్త!
TeluguStop.com
ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.
శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే.ఎంత సన్నగా ఉన్న వారైనా లావుగా తయారవుతారు.
ఈ అధిక బరువు అందాన్నీ మరియు ఆరోగ్యాన్నీ తీవ్రంగా దెబ్బ తీస్తాయి.ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ల లోపం, ఎక్కువ సమయం పాటు ఒకేచోట కూర్చోవడం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరిగి పోతుంటారు.
అయితే ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా బరువు పెరుగుతారు.
ముఖ్యంగా భోజనం విషయంలో చేసే కొన్ని పొరపాట్లు అధిక బరువు పెరగేందుకు తోడ్పడుతుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది భోజనంను వేగంగా తినేస్తుంటారు.కానీ, ఎంత బిజీ అయినా భోజనాన్ని వేగంగా కానిచ్చేయకూడదని.
నెమ్మదిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు.ఎందుకంటే, వేగంగా తినడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయట.
అందులో మొదటిది బరువు పెరగడం.అదెలా అంటే.
వేగంగా భోజనం చేసే సమయంలో కాస్త ఎక్కువగా తినేస్తారట.ఫలితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
అలాగే భోజనాన్ని త్వరత్వరగా తినేయడం వల్ల.తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.
దాంతో జీర్ణక్రియ పని తీరు క్రమంగా దెబ్బ తింటుంది.అదే విధంగా, వేగంగా భోజనాన్ని ఫినిష్ చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
అలాగే ఫాస్ట్ ఫాస్ట్‌గా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతోందట.ఫలితంగా మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇక వేగంగా తినడం వల్ల ఒక్కోసారి గుండె పట్టేడం.తద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుందట.
అందుకే భోజనాన్ని ఎవరో తరిమేస్తున్నట్టు కాకుండా.నెమ్మదిగా బాగా నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు.
పుష్ప 2 విడుదల… బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ?