వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించే పానీయాలు ఇవే?

వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించే పానీయాలు ఇవే?

అస‌లే వేస‌వి కాలం.( Summer ) ఎండ‌లు మండిపోతున్నాయి.

వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించే పానీయాలు ఇవే?

భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు.అధిక ఉష్ణోగ్రతల కార‌ణంగా ఒంట్లో వేడి( Body Temperature ) బాగా పెరుగుతుంటుంది.

వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించే పానీయాలు ఇవే?

అలాగే తగినంత నీరు తాగకపోవ‌డం, మ‌సాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవ‌డం, ఎండ‌ల్లో ఎక్కువ గ‌డ‌ప‌టం, హార్మోన్ల అసమతుల్యత, అధిక వ్యాయామం, టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వ‌ల్ల కూడా ఒంట్లో వేడి పెరుగుతుంటుంది.

అయితే ఆ వేడిని చ‌ల్లార్చేందుకు కొన్ని కొన్ని పానీయాలు గొప్ప‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ఈ జాబితాలో కొబ్బరి నీరు( Coconut Water ) గురించి మొద‌ట‌గా చెప్పుకోవ‌చ్చు.

సహజమైన మినరల్స్ ఉండే ఈ పానీయం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.ఒంట్లో వేడిని మాయం చేస్తుంది.

వేడి కార‌ణంగా వ‌చ్చే త‌ల‌నొప్పిను కూడా త‌గ్గిస్తుంది. """/" / బెల్లం-నిమ్మ షర్బత్ వేస‌వి కాలంలో తీసుకోద‌గ్గ పానీయం.

నిమ్మరసం, బెల్లం, కొద్దిగా ఉప్పును చిల్డ్ వాట‌ర్ లో వేసి మిక్స్ చేస్తే షర్బత్ రెడీ అయిన‌ట్లే.

ఈ డ్రింక్ బాడీ హీట్ ను రెడ్యూస్ చేస్తుంది.ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించే పానీయాల్లో బ‌ట‌ర్‌మిల్క్( Butter Milk ) ఒక‌టి.

అర క‌ప్పు పెరుగులో ఒక గ్లాస్ చ‌ల్ల‌ని నీరు, చిటికెడు జీల‌క‌ర్ర పొడి, చిటికెడు ఉప్పు క‌లిపి తీసుకుంటే బాడీ దెబ్బ‌కు కూల్ అవుతుంది.

అధిక ఉష్ణోగ్రతల వ‌ల్ల ఎదురై త‌ల‌నొప్పి, చిరాకు, అల‌స‌ట వంటివి ప‌రార్ అవుతాయి.

"""/" / మోసంబి జ్యూస్ అదేనండి బ‌త్తాయి ర‌సం వేస‌వి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా బ‌త్తాయి ర‌సం ఒంట్లో వేడిని చ‌ల్లారుస్తుంది.ఒంట్లో బలహీనతను పోగొడుతుంది.

తల తిరగడం, నోరు పొడిబార‌డం వంటి స‌మ‌స్యల‌ నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తుంది.వాటర్‌మెలాన్ జ్యూస్ కూడా బాడీకి తేమ‌ను అందించి హీట్ ను త‌గ్గిస్తుంది.

స‌న్ స్ట్రోక్ బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.డీహైడ్రేష‌న్ నుంచి మిమ్మ‌ల్ని దూరంగా ఉంచుతుంది.

అయితే పుచ్చ‌కాయ జ్యూస్ ను ఇంట్లోనే షుగ‌ర్ లేకుండా చేసుకుంటే ఇంకా మంచిది.

ఇక ఇవే కాకుండా రాగి జావ‌, స‌బ్జా వాట‌ర్‌, జీల‌క‌ర్ర నీరు, పుదీనా ష‌ర్బ‌త్ వంటి పానీయాలు కూడా వేస‌వి కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించ‌డానికి ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి22, శనివారం 2025