ఎడమ చేయి నొప్పి గుండె జబ్బులకే కాదు..వాటికీ సంకేతమే!
TeluguStop.com
సాధారణంగా గుండె పోటు వచ్చే ముందు ఎడమ చేయి తీవ్రంగా నొప్పి పుడుతుంటుంది.
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు అత్యధికంగా కనిపించే లక్షణాల్లో ఇదీ ఒకటి.అలా అని ఎడమ చేయి నొప్పి వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా గుండె పోటు వస్తుందనీ కాదు.
ఇతరితర కారణాల వల్ల కూడా ఎడమ చేయి నొప్పి పడుతూ ఉంటుంది.మరి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా ఎడమ చేయి నొప్పి పుట్టడానికి కారణాలు ఏంటీ.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కంప్యూటర్ల ముందు గంటలు తరబడి పని చేసే వారు సరైన భంగిమలో కూర్చోకుంటే.
వారిలో ఎడమ చేయి నొప్పి ఎక్కువగా ఉంటుంది.అందు వల్ల, కూర్చునే పొజీషన్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
మరియు వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి.తద్వారా ఒత్తిడి పెరగ కుండా ఉంటుంది.
"""/"/
శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడానికీ ఎడమ చేయి నొప్పి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు.
రక్త ప్రసరణ పెరగాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.ప్రతి రోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
టీ, కాఫీలు తాగడం తగ్గించాలి.ఉప్పు చాలా పరిమితంగా తసుకోవాలి.