White Hair : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు ఏంటి.. కచ్చితంగా తెలుసుకోండి!
TeluguStop.com
వయసు పైబడే కొద్ది జుట్టు తెల్లబడటం అనేది చాలా కామన్.కానీ ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య( White Hair )ను ఎదుర్కొంటున్నారు.
తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధార పడుతున్నారు.కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.
? వాస్తవంగా చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయి.అధిక ఒత్తిడి.
జుట్టు త్వరగా తెల్లబడడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి.కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
అధిక ఒత్తిడి జుట్టులో మెలనిన్ క్షీణతను వేగవంతం చేస్తుంది.ఫలితంగా వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది.
అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడటానికి జన్యుశాస్త్రం కూడా కారణం అవుతుంది.
మీ తల్లిదండ్రులు లేదా తాతలు అకాల తెల్ల జుట్టును అనుభవించినట్లయితే.మీరు కూడా దానిని అనుభవించే అవకాశం ఉంది.
"""/" /
పోషకాల కొరత వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది.విటమిన్ B12( B12 Vitamin ), ఇనుము, రాగి మరియు జింక్ వంటి పోషకాలను తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు జుట్టుకు కూడా.స్మోకింగ్ వల్ల శరీరంలోకి హానికరమైన టాక్సిన్స్ విడుదల అవుతాయి.
అవి మన ఆరోగ్యాన్ని చెడగొట్టడం తో పాటు జుట్టు సమస్యలను కూడా పెంచుతాయి.
అతిగా స్మోకింగ్ చేస్తే చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడతారు. """/" /
హార్మోన్ చేంజ్ వల్ల కొందరు అకాల తెల్ల జుట్టు సమస్యకు గురవుతారు.
కాలుష్య కారకాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, థైరాయిడ్ వంటి కారణాల వల్ల అకాల తెల్ల జుట్టుతో సహా అనేక జుట్టు సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలి అనుకున్న వారు ఒత్తిడి( Stress )కి దూరంగా ఉండండి.
పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకోండి.నిత్యం వ్యాయామం చేయండి.
కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.రసాయనాలతో కూడిన జుట్టు ఉత్పత్తులను వాడటం మానుకోండి.
బయటకు వెళ్ళినప్పుడు జుట్టును తప్పకుండా కవర్ చేసుకోండి.మరియు కురులను ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోండి.
కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చిన బస్సు.. చివరికి ఏమైందో చూస్తే గుండెలదురుతాయి..!