చిన్నారుల్లో మధుమేహం రావడానికి కారణాలేంటి.. ఎలా గుర్తించాలి..?
TeluguStop.com
మధుమేహం.దీన్నే షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్( Diabetes ) అని కూడా పిలుస్తారు.
ఒకప్పుడు వయసు పైబడిన వారు మాత్రమే మధుమేహం బాధితులుగా ఉండేవారు.కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మధుమేహానికి గురవుతున్నారు.
చివరకు చిన్నారుల్లో సైతం డయాబెటిక్ పేషెంట్స్ పెరుగుతున్నారు.అసలు చిన్నారుల్లో మధుమేహం రావడానికి కారణాలు ఏంటి.
? దాన్ని ఎలా గుర్తించాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది.టైప్ 1 డయాబెటిస్ ఒకటి కాగా.
మరొకటి టైప్ 2 డయాబెటిస్.చిన్నారుల్లో ఎక్కువగా టైప్ 1 డయాబెటిస్ లక్షణాలే కనిపించేవి.
కానీ ఈ మధ్య కాలంలో టైప్ 2 డయాబెటిస్ కూడా పిల్లల్లో కనిపిస్తోంది.
చిన్నారుల్లో మధుమేహం తలెత్తడానికి చెడు ఆహారపు అలవాటు, జీవనశైలి ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర పానీయాలు, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్( Meat, Sugary Drinks, Sweets, Fast Foods, Junk Foods, Ultra-processed Foods ) ను అధికంగా తీసుకోవడం, అధిక బరువు, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మధుమేహం తలెత్తుతుంది.
కొందరిలో జన్యుపరంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. """/" /
పిల్లల్లో మధుమేహం యొక్క లక్షణాలను పరిశీలిస్తే.
తరచుగా మూత్ర విసర్జన ( Urination )చేయవలసి రావడం, ఉన్నట్లుండి బరువు తగ్గిపోవడం, అధిక దాహం, తరచూ అలసటకు గురికావడం వంటివి చిన్నారుల్లో కనిపిస్తుంటాయి.
అలాగే మధుమేహాన్ని సూచించే మరో లక్షణం అస్పష్టమైన దృష్టి.చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబితే కచ్చితంగా జాగ్రత్త పడాలి.
"""/" /
అంతేకాకుండా వికారం, వాంతులు, తరచూ కడుపు నొప్పితో బాధపడటం, కాళ్లు మరియు చేతులకి ఎలాంటి దెబ్బలు తగిలినా స్పర్శ ఉండకపోవడం వంటి లక్షణాలు కూడా మధుమేహం బారిన చిన్నారుల్లో కనిపిస్తుంటాయి.
అలాగే చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు.ఒకవేళ లక్షణాలు కనిపిస్తే మాత్రం తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త పడి వైద్యులను సంప్రదించాలి.
డయాబెటిస్ సంపూర్ణ నివారణకు చికిత్స ఉండదు.కానీ ఇన్సులిన్, ఆహారం మరియు జీవనశైలి మార్పులతో దీనిని నిర్వహించవచ్చు.
కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)