నిద్రలో నడవడానికి కారణాలివే.. లెక్కచేయకపోతే ప్రమాదమే

నిద్రలోనే నడిచే అలవాటు చాలా మందిలో ఉంటుంది.దీనినే వైద్య పరిబాషలో స్లీప్ వాకింగ్ , సోమ్నాంబులిజం అని అంటారు.

అయితే దీన్ని ఎప్పుడూ ఫన్నీగానే తప్ప సీరియస్ గా తీసుకోని ఉండరూ.సినిమాల్లో కూడా నిద్రలో నడిచే సీన్లను కామెడి యాంగిల్ లోనే చూపిస్తారు.

స్లీప్ వాకింగ్ అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.పెద్ద వాళ్ళల్లో ఇది అరుదుగానే కనిపిస్తుందని చెప్పవచ్చు.

ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయకపోయినా అంతర్లీనంగా ఉన్న అనారోగ్య సమస్యను సూచిస్తుంది.స్లీప్ వాకింగ్ సాధారణంగా రాత్రి సమయంలో నిద్రలోకి జారుకున్న తరువాత రెండు గంటలలోపు జరుగుతుంది.

ఒకానొక సమయంలో మీరు నిద్రపోతున్నప్పుడు కూర్చోవచ్చు, నడవవచ్చు మరియు సాధారణ కార్యకలాపాలను కూడా చేయవచ్చు.

H3 Class=subheader-styleస్లీప్ వాకింగ్ కారణాలు./h3p 1.

రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేల్కోవటం, తగినంత నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి ,జ్వరం, చలి , ప్రయాణం కారణంగా నిద్రలేమి వంటి ఇతర పరిస్థితుల వల్ల నిద్రకు భంగం కలిగి ఇలా జరుగుతుంది.

2.నిద్రకు , నాడీ వ్యవస్ధకు ఇబ్బంది కలిగించే కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా ఇలా సంభవించే అవకాశాలు ఉంటాయి.

"""/"/ 3.వంశపారంపర్య కారకాలు, అధిక అలసట, శరీర బలహీనత, నిరంతర తలనొప్పితో మైగ్రేన్ , తలకు బలమైన గాయం వంటి సందర్భాల్లో స్లీప్ వాకింగ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.

దీనికి వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు.అయితే హిప్నాసిస్ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు.

4.స్లీప్ క్లినిక్‌లోని 193 మంది రోగులపై జరిపిన అధ్యయనంలో ఎపిసోడ్‌లకు ప్రధాన ట్రిగ్గర్‌లలో ఒకటి పగటిపూట అనుభవించిన ఒత్తిడితో కూడిన సంఘటనలు అని కనుగొన్నారు.

H3 Class=subheader-styleతీసుకోవాల్సిన జాగ్రత్తలు./h3p """/"/ 1.

బయటకు వెళ్లకుండా కిటికీలు, తలుపులు వేసి ఉంచాలి.2.

పై అంతస్తులలో పడుకోవడం మానేయాలి.3.

చాకులు, మరియు ఇనుప సామాగ్రి ఇళ్లల్లో రాత్రి పూట ఉండకుండా చూసుకోవాలి.h3 Class=subheader-styleచికిత్స.

/h3p రోగి వయస్సు, ఎంత తరచుగా సమస్య కలుగుతోంది అన్న అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది.

స్లీప్ వాకింగ్ ను సాధారణ సమస్యగా వదిలేయకుండా, ఎందుకో కలుగుతుందో తెలుసుకుని చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

స్లీప్ వాకింగ్ వల్ల వారికే కాదు, ఆ ఇంట్లో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగవచ్చు.

తెలుగు ప్రేక్షకులపై కార్తి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే.. మళ్లీ ఆ రేంజ్ వస్తుందంటూ?