శివలింగాన్ని రుద్ర పారాయణం చేస్తూ పూజించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

కార్తీకమాసం మొదలవడంతో శివాలయాలు శివనామస్మరణతో, భక్తులతో కిటకిటలాడుతుంటాయి.కార్తీక మాసం శివునికి ఎంతో పరమ పవిత్రమైనది.

ఈ మాసంలో శివలింగానికి పూజలు, హోమాలు, అభిషేకాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఒక కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం శివలింగాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

సోమవారం శివలింగానికి చందనం, పుష్పం, దీపం, దూప నైవేద్యాలతో యజ్ఞాలు చేసేవారికి శివ సాయుజ్యం చేరుతుంది.

పరమ పవిత్రమైన ఆ శివుని సోమవారం అగ్నిహోత్రం గోదానం సహస్ర అశ్వమేధయాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.

అభిషేక ప్రియుడైన శివునికి కార్తీక మాసంలో విశేష పూజలను అందుకుంటాడు.సోమవారం శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు సుఖ సంతోషాలతో గడుపుతారు.

శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో శివ లింగాన్ని పూజించడం ద్వారా 12 వేల కోట్ల శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది.

సోమవారం లింగాన్ని దర్శించడం వల్ల తీర్థయాత్ర, యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది.సాధారణంగా శివునికి అభిషేక ప్రియుడని  పిలుస్తారు.

అలాంటి అభిషేకం చేసిన నీటిని తీర్థప్రసాదాలు గా తీసుకోవడం ద్వారా, సర్వ పుణ్య తీర్ధాలలో స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శివలింగాన్ని పూజించేటప్పుడు రుద్ర పారాయణం చేస్తూ పూజించడం వల్ల శివసాయుజ్యం కలుగుతుంది.శివ లింగం అన్న చోట సమస్త దేవతలు, సమస్త లోకాలు ఉంటాయని భావించడం వల్ల శివ లింగాన్ని పూజిస్తే సమస్త దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు.

ప్రతి సోమవారం ఇలా రుద్ర పారాయణం చేస్తూ శివలింగాన్ని ఆరాధించడం వల్ల సకల సంపదలతో, నిత్యం సుఖ సంతోషాలతో గడుపుతారనీ పండితులు చెబుతున్నారు.

ప్రజా ఉద్యమాలు చేసినందుకు కేసులు..: బండి సంజయ్