వాకింగ్ వ‌ల్ల గ‌ర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత సేపు వాకింగ్ చేయొచ్చు?

గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక కీలకమైన ఘట్టం.ఆ సమయంలో శారీరక మార్పులు మరియు కడుపులో పెరుగుతున్న శిశువు కు మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యంగా తినడం ఎంతో కీలకం.

అలాగే శారీరకంగా చురుగ్గా ఉండటం కూడా అంతే అవసరం.శారీరక చురుకుదనం కోసం వాకింగ్ అనేది చాలా మంది గర్భిణీలకు వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

ప్రెగ్నెన్సీ సమయంలో వాకింగ్ సురక్షితమైనది.వాకింగ్ చురుగ్గా ఉండడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక గొప్ప మార్గం.

పైగా ఇతర వ్యాయామాలతో పోలిస్తే వాకింగ్ చేయ‌డం గర్భిణీలకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.

గర్భిణీలు( Pregnant Women ) రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గ‌ర్భిణీలు అనేక లాభాలు పొందుతారని సూచిస్తున్నారు.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎక్కువ బరువు పెరుగుటను నియంత్రించడంలో వాకింగ్ స‌హాయ‌ప‌డుతుంది.

శ‌రీరంలో అద‌నుపు కేల‌రీల‌ను వాకింగ్ ద్వారా క‌రిగించుకోవ‌చ్చు.అలాగే వాకింగ్ గ‌ర్భిణీల్లో స‌త్తువ‌ను మెరుగుప‌రుస్తుంది.

నార్మ‌ల్ డెలివ‌రీ కావ‌డానికి తోడ్ప‌డుతుంది. """/" / అలాగే చాలా మంది మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తాయి.

అయితే రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గర్బిణీల్లో జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.

దాంతో మ‌ల‌బ‌ద్ధ‌కం( Constipation ) దూరం అవుతుంది.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌హిళ‌ల మెంట‌ర్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయ‌డానికి వాకింగ్ హెల్ప్ అవుతుంది.

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి.ఇవి గ‌ర్భిణీల్లో ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గిస్తాయి.

"""/" / నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల సి-సెక్షన్ అని పిలువబడే సిజేరియన్ డెలివరీ ద్వారా ప్రసవించే అవ‌కాశం త‌గ్గుతుంది.

సాధారణ ప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయి.అది కాకుండా వాకింగ్ వ‌ల్ల‌ శరీరం మ‌రియు కండరాలు ప్రసవానికి సిద్ధమవుతాయి.

మధుమేహం మరియు ప్రీఎక్లంప్సియా రెండింటి ప్రమాదం త‌గ్గుతుంది.నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

అందుకే గ‌ర్భిణీలు వాకింగ్ ను త‌మ దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవాల‌ని అంటున్నారు.అయితే గర్భధారణ సమయంలో ఏదైనా వ్యాయామం చేయాల‌నుకుంటే తప్పనిసరిగా వైద్యుని అనుమతి తీసుకోవాలి.

వైద్యుల అనుమ‌తి లేకుండా వాకింగ్ తో స‌హా ఎటువంటి వ్యాయామం చేయ‌కూడ‌దు.

వండిన చికెన్ ను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!!