న‌డ‌క బ‌రువు త‌గ్గ‌డానికే కాదు.. అలా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం వాకింగ్‌ను డైలీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నారు.

అయితే న‌డ‌క బ‌రువు త‌గ్గ‌డానికి మాత్ర‌మే కాదు.మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి వంటి కార‌ణాల వ‌ల్ల కోట్లాది మంది చిన్న వ‌య‌సులోనే మ‌తిమ‌ర‌పు, ఆలోచ‌న శ‌క్తి స‌న్న‌గిల్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తున్నారు.

అయితే వీటి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో న‌డ‌క అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు క‌నీసం ఓ ముప్పై నిమిషాల పాటు ప్ర‌శాంతంగా వాకింగ్ చేస్తే మెద‌డు క‌ణాలు ఉత్తేజంగా మార‌తాయి.

ఫ‌లితంగా జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తి.రెండు రెట్టింపు అవుతాయి.

అలాగే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అయితే ఈ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవాలంటే త‌ప్ప‌కుండా న‌డ‌క‌ను అల‌వాటు చేపుకోవాలి.ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ప్రమాదకర ప్రభావాలను త‌గ్గించ‌గ‌ల సామ‌ర్థ్యం న‌డ‌క‌కు ఉంది.

"""/" / ఇక కొంద‌రు త‌ర‌చూ జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆగ‌మాగం అయిపోతుంటారు.

నడక ద్వారా జీర్ణ వ్యవస్థ చురుకుద‌నం పెరుగుతుంది.ప్ర‌తి రోజు కాసేపు న‌డిస్తే గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అంతేకాదు, రెగ్యుల‌ర్‌గా వాకింగ్ చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.ఊపిరితిత్తులు బ‌లంగా, ఆరోగ్యంగా మార‌తాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.మ‌రియు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు సైతం త‌గ్గుతుంది.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు మాత్ర‌మే కాదు.ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాల‌ని భావించే ప్ర‌తి ఒక్క‌రూ వాకింగ్‌ను త‌మ డైలీ రొటీన్‌లో చేర్చుకోవాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా.. నిన్న నాగార్జున నేడు బన్నీ.. ఎక్కడ చెడింది?