Ice Bath : ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదేనా.. అసలు దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..?
TeluguStop.com
ఐస్ బాత్( Ice Bath ).ఈ పేరు వినే ఉంటారు.
కానీ ఎప్పుడైనా ప్రయత్నించారా.? బాత్‌టబ్ నిండా ఐస్ గడ్డలు వేసుకుని అందులో కూర్చోవడమే ఐస్ బాత్.
చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు మరియు ఫిట్‌నెస్ ఫ్రీక్స్ తమ దినచర్యలో దీన్ని ఒక భాగం చేసుకుంటారు.
కండరాల నొప్పిని తగ్గించుకోవడం మరియు తీవ్రమైన శారీరక శ్రమ అనంతరం త్వరగా రికవరీ అవ్వడం కోసం ఐస్ బాత్ వైపు మొగ్గు చూపుతారు.
ఇటీవల సమంత తో సహా పలువురు సినీ తారలు కూడా ఐస్ బాత్ చేస్తూ వార్తల్లో నిలిచారు.
అసలు ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదేనా.? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.
? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఐస్ బాత్ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
"""/"/
ఐస్ బాత్ కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కండరాల నొప్పులు మరియు వాపులకు( Muscles Pain ) ఐస్ బాత్ సహజ మెడిసిన్ లా పని చేస్తుంది.
అలాగే ఐస్ బాత్ చేయడం వల్ల రక్తప్రసరణ వేగవంతం అవుతుంది.ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఫలితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండవచ్చు.ఐస్ బాత్ చేయడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ( Central Nervous System ) ఉత్తేజంగా మారుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు మరియు మనసు ప్రశాంతంగా మారతాయి.
అలాగే నిద్రలేమితో బాధపడుతున్న వారికి కూడా ఐస్ బాత్ అనేది ఒక సహజ నివారణగా పనిచేస్తుంది.
పడుకునే ముందు ఐస్ బాత్ చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు.నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
"""/"/
ఐస్ బాత్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ( Immunity Power ) బలపడుతుంది.
అదే సమయంలో చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది.అంతేకాదు, ఐస్ బాత్ ను దినచర్యలో భాగం చేసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.
దాంతో శరీరంలో అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అయితే అధిక రక్తపోటు( High Blood Pressure )తో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరియు చర్మ సమస్యలు ఉన్నవారు ఐస్ బాత్ చేసే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
భూమిక విడాకుల విషయంలో నాగార్జున జోక్యం.. అసలు సంగతి తెలిసి మతిపోయింది..?