స‌న్ స్క్రీన్ వ‌ల్ల లాభాలేంటి.. రోజూ వాడొచ్చా..?

స‌న్ స్క్రీన్( Sun Screen ) వాడండి.స‌న్ స్క్రీన్ వాడండి అంటూ ఇటీవ‌ల కాలంలో చ‌ర్మ నిపుణులు గ‌ట్టిగా చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ లో స‌న్ స్క్రీన్ ను భాగం చేసుకుంటున్నారు.

అస‌లు స‌న్ స్క్రీన్ వ‌ల్ల లాభాలేంటి.? రోజూ వాడొచ్చా.

? లేక బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే రాసుకోవాలి.? ఎటువంటి స‌న్ స్క్రీన్ ను ఎంపిక చేసుకోవాలి.

? వంటి ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానాలు తెలుసుకుందాం.సన్ స్క్రీన్ వాడటం వల్ల క‌లిగే లాభాలు చాలానే ఉన్నాయి.

ప్ర‌ధానంగా చూసుకుంటే.చర్మానికి హాని క‌లిగించే మ‌రియు చ‌ర్మ క్యాన్సర్‌కు( Skin Cancer ) కార‌ణమ‌య్యే UVA మరియు UVB రశ్ముల నుంచి స్కిన్ ను స‌న్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది.

అలాగే సన్ స్క్రీన్ వాడటం వ‌ల్ల‌ ఏజింగ్( Ageing ) ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుంది.

చ‌ర్మం తొందరగా ముడతలు ప‌డ‌కుండా ఉంటుంది.సన్ స్క్రీన్ ను వాడ‌టం అల‌వాటు చేసుకుంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

చర్మ రంగు సమతుల్యతగా ఉంటుంది.మ‌రియు హెల్తీగా, గ్లోగా కూడా మారుతుంది.

"""/" / ఎటువంటి స‌న్ స్క్రీన్ ను ఎంపిక చేసుకోవాలి? అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.

అది మీ చర్మ రకంపై ఆధార‌ప‌డి ఉంటుంది.ఆయిలీ స్కిన్ క‌లిగిన వారు జెల్ బేస్డ్, డ్రై స్కిన్ క‌లిగిన వారు క్రీమ్ బేస్డ్ స‌న్ స్క్రీన్ ను ఎంచుకోవాలి.

స‌న్ స్క్రీన్ ను ఎంపిక చేసుకునే ముందు దాని SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

నాన్-కోమెడోజెనిక్, ఫ్రాగ్రాన్స్- ఫ్రీ, డెర్మటాలజిక‌ల్లీ టెస్ట్డ్ అన్నవి మాత్ర‌మే ఎంచుకోవాలి. """/" / ఇక స‌న్ స్క్రీన్ ను రోజూ వాడొచ్చు.

సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నప్పటికీ వాడటం మంచిదే.ఎందుకంటే, మొబైల్, ల్యాప్‌టాప్, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ చర్మానికి హాని చేసేలా ప్రవర్తిస్తాయి.

ముడతలు, డార్క్ స్పాట్స్, స్కిన్ ఏజింగ్‌కు కారణమవుతాయి.సో.

ఇంట్లో ఉన్న కూడా స‌న్ స్క్రీన్ ఉప‌యోగంచండి.లేదు అనుకుంటే బయటకు వెళ్లే 15-20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోండి.

ఎక్కువ సమయం బయట ఉంటే ప్రతి 2-3 గంటలకోసారి రీఅప్లై చేయాలి.