వారానికోసారి పెడిక్యూర్ చేసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్‌!

పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పెడిక్యూర్ ఎంతో అవ‌స‌రం.అందుకే కొంద‌రు త‌ర‌చూ బ్యూటీపార్ల‌ర్స్‌కు వెళ్లి పెడిక్యూర్ చేయించుకుంటారు.

అయితే ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో బ్యూటీపార్ల‌ర్స్‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.అందువ‌ల్ల‌, ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.

మ‌రి ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి ? అస‌లు పెడిక్యూర్ వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెడిక్యూర్ చేసుకోవ‌డానికి ముందుగా కాలి గోళ్లపై ఉన్న నెయిన్ పాలిష్‌ను రిమూవ‌ర్‌తో తొలగించాలి.

ఆ త‌ర్వాత గోళ్ల‌ను స‌మానంగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక ట‌బ్‌లో గోరు వెచ్చ‌ని నీళ్లు పోసి అందులో నిమ్మ ర‌సం, ఉప్పు, కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ, కావాలనుకుంటే ఆరెంజ్ ఎసెన్స్ వేసి మిక్స్ చేసి పాదాల‌ను ట‌బ్‌లో ఇర‌వై నిమిషాల పాటు ఉంచాలి.

అనంత‌రం పాదాల‌ను ప్యుమిస్ స్టోన్‌తో కానీ, ఫుట్ స్క్రబ్బర్ తో కానీ, ఏదైనా బరకగా ఉండే పిండితో కానీ పాదాల‌ను స్క్ర‌బ్ చేయాలి.

"""/" / అనంత‌రం పాదాల‌ను శుభ్ర‌మైన నీటిలో క‌డిగి.ట‌వ‌ల్‌తో త‌డి లేకుండా తుడుచుకోవాలి.

ఇప్పుడు మర్దనా ఆయిల్‌ లేదా మాయిశ్చరైజర్‌ను పాదాల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకుంటే స‌రిపోతుంది.

ఇలా వారానికి ఒక సారి పెడిక్యూర్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

చాలా మంది పాదాల ప‌గుళ్ల‌తో బాధ ప‌డ‌తారు.కానీ, పెడిక్యూర్ చేసుకుంటే ఈ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

అలాగే పెడిక్యూర్ వ‌ల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.దాంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్‌ వెయిన్స్‌ వంటివి తలెత్త‌కుండా ఉంటాయి.

పెడిక్యూర్ చేసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్, చిరాకు వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

మ‌న‌సు ప్ర‌శాంతంగా మారుతుంది.ఇక పెడిక్యూర్ వ‌ల్ల టెన్షన్ పూర్తిగా పోతుంది.

దాంతో కోపం, కన్‌ఫ్యూజన్ త‌గ్గి.మైండ్ ఉత్సాహంగా, వేగంగా ప‌ని చేస్తుంది.

Realme 12X 5G : రియల్ మీ 12X 5G స్మార్ట్ ఫోన్ ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. లాంచింగ్ ఎప్పుడంటే..?