ముఖానికి కొబ్బరి నూనెతో ఇలా చేస్తే.. ఎన్ని బెనిఫిట్సో!!

కొబ్బరి నూనె తెలియ‌ని వారుండ‌రు.దీనిని ఎక్కువ‌గా శిరోజాల పోష‌ణ‌కు వాడితే.

కొంద‌రు వంట‌ల‌కు కూడా ఉప‌యోగిస్తారు.అలాగే కొబ్బరి నూనె చాలా వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది.

కొబ్బ‌రి నూనెతో చేసిన వంట‌లు తిన‌డం వ‌ల్ల జీర్ణవ్యవస్థ మెరుగుప‌డుతుంది.కొబ్బరి నూనెలోని శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.

అయితే వంట‌ల‌కు, శిరోజాల‌కు, ఆరోగ్యానికి మాత్ర‌మే కాకుండా.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి కొబ్బ‌రి నూనె ఎలా ఉప‌యోగిస్తే.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోగ‌ల‌మో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తిరోజు నిద్రించే ముందు కొద్దిగా కొబ్బ‌రి నూనె తీసుకుని ముఖానికి అప్లై చేసి.

కాసేపు మర్దనా చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు పోవ‌డంతో పాటు చ‌ర్మం మృదువుగా, తేమ‌గా మారుతుంది.

"""/" / అలాగే మొటిమల‌ను త‌గ్గించ‌డంలోనూ కొబ్బ‌రి నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది.అందుకు కొబ్బ‌రి నూనెలో కొద్దిగా క‌ల‌బంద మ‌రియు చిటికెడు ప‌సుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గించ‌డంతో పాటు మొటిమల వ‌ల్ల వ‌చ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది.

ఇక కొబ్బ‌రి నూనెలో కొద్దిగా షుగ‌ర్ వేసి.ముఖానికి కాసేపు స్క్రబ్ చేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటిలో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొల‌గుతాయి.

మ‌రియు చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!