గూగుల్ లెన్స్‌తో అద్భుత ప్రయోజనాలెన్నో.. దీన్నెలా వాడాలంటే!
TeluguStop.com
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ లెన్స్ అనే ఫీచర్ గురించి విషయం మీకు తెలిసే ఉంటుంది.
ఈ ఫీచర్ చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేస్తారు.ఎందుకంటే దీన్ని ప్రయోజనాల గురించి ఎక్కువ మందికి తెలియదు.
గూగుల్ లెన్స్ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ లేదా డిసేబుల్ కూడా చేయొచ్చు.గూగుల్ లెన్స్ ఆండ్రాయిడ్ వర్షన్ గూగుల్ క్రోమ్ లో కూడా అందుబాటులో ఉంది.
మీరు ఏదైనా ఇమేజ్ లోని టెక్స్ట్ ను సెర్చ్ చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే ఒక ఇమేజ్ ను ట్రేస్ చెయ్యడానికి కూడా ఇది యూజ్ అవుతుంది.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక ఇమేజ్ పై ఫింగర్ హోల్డ్ చేసి "సెర్చ్ విత్ గూగుల్ లెన్స్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయడమే! ఇక డెస్క్‌టాప్ వర్షన్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ లెన్స్ మరిన్ని ఫెసిలిటీస్ అందిస్తుంది.
దీని ద్వారా మీరు ఏ ప్రాంతంలో ఫోటో దిగారనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
అలాగే ఏదైనా ఒక వెబ్ పేజీలోని టెక్స్ట్ ని గూగుల్ లెన్స్ సహాయంతో స్పీకర్ ద్వారా వినవచ్చు.
దీన్ని ఎనేబుల్ చేయడం చాలా సులభం.మొదటిగా మీరు క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో Chrome://flags అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
తర్వాత ఓపెన్ అయ్యే పేజీలోని సెర్చ్ బార్‌లో గూగుల్ లెన్స్ అని టైప్ చేయాలి.
అప్పుడు మీకు "సెర్చ్ యువర్ స్క్రీన్ విత్ గూగుల్ లెన్స్" అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది.
దీని పక్కనే డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది.దానిపై క్లిక్ చేసి ఎనేబుల్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇదే విధంగా దీన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు.క్రోమ్ బ్రౌజర్‌లోని గూగుల్ లెన్స్ కాకుండా మీరు ప్రత్యేకంగా గూగుల్ లెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ అప్లికేషన్ ను ఉపయోగించి రియల్ వరల్డ్ లో కనిపించే టెక్స్ట్ ను ఫోన్ లోకి ఈజీగా కాపీ చేయొచ్చు.
అలాగే ఏదైనా వస్తువుని గూగుల్ లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసి అలాంటి వస్తువును షాపింగ్ చేయొచ్చు.
మీ పుస్తకాలలోని టెక్స్ట్ ను ఫోన్ కాపీ చేయాలన్నా గూగుల్ లెన్స్ బాగా యూజ్ అవుతుంది.
మీకు తెలియని ఏదైనా మొక్క, పువ్వు, ఫేమస్ పెయింటింగ్, జంతువుని గూగుల్ లెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు.
క్యూఆర్ కోడ్స్ ను కూడా క్యాప్చర్ చేసి వెబ్ సైట్లకు యాక్సెస్ చేయవచ్చు.
ఏదైనా ఫోన్ నెంబర్ లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ పేపర్ పై ఉంటే వాటిని గూగుల్ లెన్స్ ద్వారా ఫోన్ కి ఈజీగా కాపీ చేయొచ్చు.
కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ ని కాంటాక్ట్స్ లో సేవ్ కూడా చేసుకోవచ్చు.రెస్టారెంట్ పేరుతో గూగుల్ కాంటాక్ట్స్ ద్వారా రివ్యూస్ క్షణాల్లోనే తెలుసుకోవచ్చు.
ఇంకా మరెన్నో ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి.
గ్రీన్ టీలో ఇవి కలిపి రాశారంటే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది..!