ఆర్టీఐ చట్టం ఉల్లంఘించిన అధికారులపై చర్యలేవి ?
TeluguStop.com
ఆర్టీఐ చట్టం ఉల్లంఘించిన అదికారుల సొంత డబ్బు జరిమానాగా వసూలుచేయాలి.చర్యలు ఉంటేచట్టం బతుకుతుంది.
ప్రభుత్వయంత్రాగములో పారదర్సకత,జవాబుదారీతనం తీసుకరావటంకోసం 2005 లో సమాచారహక్కుచట్టం తీసుకరాబడింది.అయితే అదికారులు కావాలని ఈచట్టాన్ని నీరుగార్చేందుకు అన్నివిధాలాప్రయత్నం చేస్తున్నారు.
అందుకు కమీషనర్లు చట్టాన్నిఉల్లంఘించిన అదికారులను వారిపైనచర్యలు తీసుకోకుండా తోడ్పడుతున్నారు అన్నభావనకలుగుతుంది.ఆర్టీఐ కమీషనర్లు తమ డ్యూటీలు నిజాయితీగా చేయ్యకపోతే "సహచట్టం " మూసెయ్యటం ఖాయం.
అపుడు వారు ఆకుర్చీలలో కూర్చునేపని ఉండదు .కార్యకర్తలు కార్యాలయాలచుట్టూ తిరిగేపని ఉండదు .
కార్యకర్తలు ఎంతోకష్టపడి ప్రభుత్వ యంత్రాగము లోని భాధ్యతారాహిత్యాన్ని , నిర్లక్ష్యాన్ని , సహచట్టాన్ని అధికారులు ఏరకంగా ఉల్లంఘిస్తుందీ , ఆర్టీఐ కమీషనర్ల దృష్టికి తీసుకపోయినా కూడా , లాంటిఅధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటంవలన , పౌరసమాచార అధికారులు , మొదటి అప్పిల్లేట్ అధికారులు కావలసినసమాచారం ఇవ్వటంలేదు.
చట్టం నీరుగారిపోవటానికి ఆర్టీఐ కమీషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.చట్టాన్నిఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటే ఈగతిపట్టేదికాదు .
చర్యలు లేనందున ఆధికారులు సమచారం ఇవ్వటంలేదు.నిన్న మంగళగిరి సమాచారహక్కు చట్ట కమీషనర్ కార్యాలయానికి వెళ్ళటం జరిగింది .
కార్యాలయమునకు ప్రతిరోజూ వందలాదిమంది సహా కార్యకర్తలు వస్తుంటారు.శ్రీకాకుళంనుండి , అనంతపురం నుండి ఎంతోదూరంనుండి వ్యయప్రయాసలకు ఓర్చుకొని వస్తుంటారు.
ఒక్కొక్క కమీషనర్ కి 2 లక్షల 25 వేల జీతం పెంచుతున్నట్లు ఈమద్యనే ప్రభుత్వం ప్రకటించించింది.
మరి ఆభవనానికి అద్దె ఎన్ని లక్షలరూపాయలు ఉంటుందోమరి.ఇన్నిలక్షలు ఖర్చుపెడుతున్న ప్రభుత్వానికి అక్కడకి వచ్చే వందలాది మంది సహ కార్యకర్తలు ఒంటికి (మూత్రము) పోవటానికి సౌకర్యం లేదు .
అడిగితె అదిగో ఆరూంలొకి వెళ్ళండి అనిచెప్తారు.అక్కడ అది అధికారులు పనిచేసుకునే రూము.
బయటినుండి వచ్చే కార్యకర్తలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండాలి.అయినా వెలగపూడిలో గతప్రభుత్వం కట్టిన భవనాలు ఎన్నోఉండగా లక్షలులక్షలు పెట్టి అద్దె భవనాలు ఎందుకు ? ప్రజాధనం వృధా అవుతుందికదా ! అందులొ ఫ్రభుత్వం ఇపుడు ఎంతో ఆర్థికఇబ్బందుల్లో ఉంది .
అలాంటపుడు రడీగాఉన్న ప్రభుత్వ భవనాలలోకి మార్చవచ్చుకదా ! కమీషనర్ల తీరుమారితే సహచట్టం పదికాలాలపాటు పనిచేస్తుంది.
ఎందుకంటె నిన్న నెను వెళ్లిన కేసులో పీఐఓ చట్టంలోని 6 వ సెక్షను 3 లొని నిబందన ప్రకారం ,ఆకార్యాలయంలో పిర్యాదుదారునికి కావలసిన సమచారం లేకపొతే , ఎక్కడవుందో అక్కడికిపంపి , ఆవిషయము 5 రోజులలోపుగా పిర్యాదుదారునికి తెలియచేయాలి.
ఆపని పీఐఓ చెయ్యలేదు .ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించాడు.
"""/"/
ఒకవేల సమాధానం ఉండిఉంటే 30 రోజుల్లోపు సమాదానం ఇవ్వాలి.ఆపని చెయ్యలేదు .
పీఐఓ ఇక్కడకుడా సెక్షను 7 లొని 1 వ నిబంధనను ఉల్లంఘించాడు.మొదటి అప్పిల్లేటే కి వ్రాసినాకూడా పదినెలలు గడచినా సమాధానంలేదు.
ఇంతస్పష్టంగా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు అని బహిర్గతం అయినాకూడా , ఆ అధికారులపై చర్యలు తీసికోకపోతే , ఇంకా చట్టం ఎందుకు ? అక్కడ కమిషనర్ల కుర్చీలెందుకు , అద్దెభవనాల బాడుగలు ఎందుకు ,? వెంటనె ప్రభుత్వం కమీషనర్లు చట్టబద్ధంగా తీర్పులు ఇచ్చేవిధంగా ఆదేశమివ్వాలి.
అద్దెభవనాలలో కాకుండగా ప్రభుత్వ భవనాలలో కి మారిస్తే కోట్లరూపాయలు మిగులుతాయి.ఎందుకంటె ఇపుడు చాలా ప్రభుత్వకార్యాలయాలు అద్దెభవనాలలోనే ఉంటున్నాయి.
సమచారహక్కు చట్టం పదికాలాలపాటు బ్రతకాలంటే ముందుగా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారాలపై జరిమానా వేసి , అది వారిసొంత డబ్బునుండి వాసులు చెయ్యాలి.
ఇలా చేసినట్లయితే రెండవవాడికి భయం ఉంటుంది.
పుష్ప2 సినిమా బీజీఎం కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్.. దేవిశ్రీకు భారీ షాక్ తగిలిందా?