MLA Padi Kaushik Reddy : సీఎం రేవంత్ ఏం సమాధానం చెబుతారు..?: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
TeluguStop.com
కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( Khairatabad MLA Danam Nagendar ) పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Telangana Assembly Speaker Gaddam Prasad Kumar ) ను ఎమ్మెల్యేల బృందం కలిసింది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు.
దీనిపై మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి( MLA Padi Kaushik Reddy ) మాట్లాడుతూ దానం నాగేందర్ పై చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారని అన్నారు.
"""/"/ గతంలో దానం నాగేందర్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్( Congress ) ఇప్పుడు పార్టీలో ఏ విధంగా చేర్చుకుందని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లోపు దానంపై అనర్హత వేటు పడుతుందని తెలిపారు.
ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాటలను గుర్తు చేసిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.