కాంగ్రెస్ లో చేరితే టికెట్ సంగతేంటి ? అడ్డుగా మారిన అప్లికేషన్ 

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు  రాజకీయ వలసలు తీవ్రతరం అయ్యాయి.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉంది.

అదీ కాకుండా ప్రధాన పార్టీలన్నీ ఈ వలసల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో, తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్( BRS Party ) తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది .

మరో వారం రోజుల్లో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.కాంగ్రెస్ ( Congress Party )నుంచి పోటీ చేయాలనుకున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది .

ఆ గడువు కూడా ముగిసింది. """/" /  దీంతో బిఆర్ఎస్ టిక్కెట్ దక్కని నేతలు కాంగ్రెస్ ( Congress Party )లో చేరాలనుకుంటున్నా, అక్కడ టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం మొదలైంది.

రెండు రోజుల క్రితమే కాంగ్రెస్  టికెట్ కు దరఖాస్తు ముగియడంతో, కాంగ్రెస్ లో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంపైనే గందరగోళానికి గురవుతున్నారు.

కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే ఆశావాహులంతా దరఖాస్తు చేసుకున్నారు.రేపటి నుంచి ఆ దరఖాస్తుల ఒడబోత కార్యక్రమం మొదలుపెట్టనున్నారు.

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే తమకు టిక్కెట్ వస్తుందా లేదా అని విషయంపై బీఆర్ఎస్,  బిజెపి( BJP Party )లోని అసంతృప్త నేతలు గందరగోళం లో ఉన్నారు.

కాంగ్రెస్ లో చేరినా, తమకు టికెట్ దక్కకపోతే పరిస్థితి ఏమిటనే దానిపైన ఆరా తీస్తున్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి కాంగ్రెస్ ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

119 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు అందాయి.కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సగటున పది నుంచి ఇరవై మంది వరకు పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో పాత వారికి కాకుండా,  కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది గందరగోళంగా మారింది.

కొత్త గా పార్టీలో చేరినా, వారి కోసం టికెట్ నిబంధనల్లో మార్పులు చేస్తే.

పాత నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనే ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం కాంగ్రెస్( Congress Party ) లో చేరాలనుకునే వారంతా ఈ విషయంలోనే ఆలోచనలో పడ్డారట.

.

బ్యాటింగ్ చేస్తూ గుండెపోటు.. నిమిషాల్లో మరణించిన క్రికెటర్.. వీడియో వైరల్..