పాపం ఏం కష్టమొచ్చిందో.. సూసైడ్ అటెంప్ట్ చేసిన తిమింగలం.. వైరల్ అవుతున్న వీడియో!

ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయి.అవి కూడా బాధ, జాలి అనే ఎమోషన్స్ తో గుండె బరువెక్కి మౌనంగా విలపిస్తాయి.

ఇప్పటికే జంతువులు విపరీతంగా బాధపడిపోయిన వీడియోలు నెట్టింట ప్రత్యక్షమై మనల్ని ఎంతగానో కదిలించాయి.

అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరి గుండెల్ని బాగా పిండేస్తోంది.

ఈ వీడియోలో ఒక భారీ తిమింగలం తన జీవితాన్ని ముగించడానికి ఎంతో ప్రయత్నించింది.

ఈ దృశ్యాలు నెటిజన్ల మనసులను కలచివేస్తున్నాయి.అసలింతకీ ఆ తిమింగలం చనిపోవడానికి ఎందుకు ప్రయత్నించింది? దీని విషాదగాథ ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

1947లో ఐస్లాండ్ తీరం సమీపంలో మెరైన్ ల్యాండ్ అధికారులకి ఒక తిమింగలం చిక్కింది.

దీంతో వారు దాన్ని నయాగరా ఫాల్స్ సమీపంలోని కెనడియన్ మెరైన్ పార్క్ లో వదిలేశారు.

అక్కడి సిబ్బంది దానికి కిస్కా అని పేరు పెట్టి ప్రతిరోజూ సరైన వేళకు ఆహారం అందించడం ప్రారంభించారు.

ఐదు సంవత్సరాల్లో అది పెరిగి పెద్దయి ఐదు పిల్లలకు కూడా తల్లి అయ్యింది.

దురదృష్టవశాత్తు ఆ 5 పిల్లలు కిస్కా కళ్ళముందే చనిపోయాయి.తనతోపాటే పెరుగుతున్న మరో రెండు తిమింగలాలు కూడా మరణించాయి.

దీంతో ఆ విషాదం లోనే మునిగితేలుతొందీ తిమింగళం.తన పిల్లలు, తోటి తిమింగలాలు చనిపోయి ఇప్పటికే పది సంవత్సరాలు అవుతోంది.

అంటే అది దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది.ఇప్పుడు దాని వయసు 44 ఏళ్లు.

అయితే ఇటీవల ఈ తిమింగలం ఒక వాటర్ ట్యాంకుకు తన తలను/em గట్టిగా మోదుతూ కనిపించింది.

అది చాలాసార్లు అలాగే తన తలను పదే పదే ట్యాంకుకు కొడుతూ ఉంటే అక్కడివారు ఏమైందో అని ఆందోళన పడి బయటికి వచ్చి చూశారు.

అయితే అప్పటికే ఆ తిమింగలం తన తలను కొడుతూ చాలా దయనీయమైన పరిస్థితిలో కనిపించింది.

ఈ హృదయ వికారమైన దృశ్యాలను కొందరు నెట్టింట షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ తిమింగలం ఒంటరిగా జీవించలేక.పార్క్ లో సరైన స్వేచ్ఛ లేక ఉక్కిరి బిక్కిరి అవుతుందేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఒక విషాదం జరిగిన తర్వాత పదేళ్లు బందిఖానాగా ఉండటం ఏ జీవికైనా కష్టమేనని మరికొందరు సానుభూతి తెలుపుతున్నారు.

అయితే ఒక మూగ జీవిని పట్టుకొచ్చి పార్క్ లో బంధించి హింసించడం ఎంత వరకు సమంజసమని జంతు ప్రేమికులు నిలదీస్తున్నారు.

దాన్ని మళ్లీ సముద్రంలో వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అందాన్ని పెంచే టమాటో.. వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా వాడాలంటే?