Pawan Kalyan, Sushmita , Ram Charan: వామ్మో.. సుష్మిత, చరణ్ కు మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చుపెట్టేవాడా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( Mega Family )మంచి పలుకుబడి ఉన్న సంగతి తెలిసిందే.
వ్యక్తిగతంగా, నటులుగా ఈ ఫ్యామిలీకు మంచి గౌరవం ఉంది.మెగా బ్రదర్స్ తో పాటు వారి వారసులు కూడా స్టార్ పొజిషన్లో దూసుకుపోతున్నారు.
వీరంతా ఒకచోట గుమ్మి గుడితే సందడి మామూలుగా ఉండదని చెప్పాలి.చూడ్డానికి బయట సైలెంట్ గా కనిపిస్తుంటారు కానీ ఇంట్లో మాత్రం అందరూ వైలెంట్ అన్నట్టుగా ఉంటారు.
అందులో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాత్రం మొదటి స్థానంలో ఉంటాడు అని తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన నటుడుగా, వ్యక్తిగతంగా అందరికీ బాగా పరిచయమని చెప్పాలి.
సైలెంట్ గా ఉంటూ ఏ టైంలో ఏది మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటాడు పవన్.
అంతేకాకుండా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించినప్పుడు కూడా సైలెంట్ గా కనిపిస్తూ ఉంటాడు.
అంతా సందడి చేసినట్లు అనిపించదు.కానీ కొన్ని సందర్భాలలో ఇంట్లో వారితో బాగా సరదాగా ఆటపట్టిస్తుంటాడని తెలిసింది.
"""/" /
సైలెంట్ గా ఉంటూనే వారి మధ్య చిచ్చు పెడుతుంటాడని తెలిసింది.
ఈ విషయాన్ని గతంలో రామ్ చరణ్( Ram Charan ) తెలుపగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో మరోసారి వైరల్ అవుతుంది.
తండ్రి సపోర్టుతో ఇండస్ట్రీకి అడుగు పెట్టిన రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గట్టు పేరు సంపాదించుకున్నాడు.
అంతకుమించి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు.కెరీర్ మొదటి నుంచి చరణ్ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ లు కొట్టగా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
కానీ వెనుకడుగు వేయకుండా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అంతకుమించి అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఉపాసనను ( Upasana )ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇటీవల పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చాడు.
"""/" /
రామ్ చరణ్ బయట ఎలా ఉంటాడో ఇంట్లో కూడా అంతే సరదాగా ఉంటున్నట్లు కనిపిస్తూ ఉంటాడు.
మామూలుగా రామ్ చరణ్ చేసే సందడంతా ఆయన పాల్గొనే ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉంటుంది.
తోటి నటీనటులతో చాలా ఫ్రీగా ఉంటాడు.ఇంట్లో వాళ్ళతో కూడా చాలా సరదాగా కనిపిస్తూ ఉంటాడు.
చరణ్ కు సుష్మిత, శ్రీజ ( Sushmita, Srija )అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు.
అయితే చరణ్, సుష్మితలకు చిన్నప్పుడు బాగా గొడవ జరిగేదట.వారిద్దరికీ అసలు పడదట.
ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళట.ఈ విషయాన్ని స్వయంగా చరణ్ తెలిపాడు.
అయితే వీరిద్దరికీ మధ్య గొడవ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని తెలిపాడు.
"""/" /
పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్కూల్ నుంచి కానీ కరాటే స్కూల్ నుంచి కానీ వచ్చాక మళ్లీ సాయంత్రం వెళ్లే సమయం మధ్యలో ఆయనకు బోర్ కొట్టడంతో వెంటనే చరణ్ ను, సుష్మితను పిలిచేవాడట.
ఇక ఉదయాన్నే వాడు ఏదో అన్నాడని సుస్మిత తో చెబుతూ పవన్ కళ్యాణ్ కావాలని అక్కడ గొడవ క్రియేట్ చేసేవాడట.
అయిన వదిలేసేయ్ ఆ విషయం గురించి అని మళ్లీ పవన్ కళ్యాణ్ అనేవాడట.
కానీ సుష్మిత వదలకుండా ఏం జరిగింది అంటూ నేరుగా చరణ్ తోనే గొడవపడేదట.
అలా పవన్ కళ్యాణ్ వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి బాగా ఎంజాయ్ చేసేవాడని తెలిసింది.
ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?