వామ్మో! గడ్డ కట్టే చలిలో మంచు పర్వతం ఎక్కిన 53 ఏళ్ల మహిళ!
TeluguStop.com
అకాన్కాగువా పర్వతం గురించి వినే వుంటారు.ఆ ఖండంలోని అత్యంత ఎత్తయిన శిఖరం ఇదే.
దానిని అధిరోహించడం సాధారమైన విషయం కాదు.అయితే భోపాల్ కు చెందిన 53 సంవత్సరాల జ్యోతి రాత్రే అనే మహిళ దక్షిణ అమెరికాలోగల 22,831 అడుగుల మంచుతో కప్పబడిన ఈ అకాన్కాగువా పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించి చరిత్ర సృష్టించింది.
ఈ ఘటన జనవరి 3న జరుగగా ఈ ఘనత సాధించిన దేశంలోనే అత్యంత వృద్ధ మహిళగా ఆమె తన పేరుని లిఖించుకుంది.
ఈ క్రమంలో అకాన్కాగువా పర్వతాన్ని స్కేల్ చేయడానికి ముందే అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న బెర్మెజో పర్వతాన్ని కూడా అధిరోహించింది.
48 సంవత్సరాల తరువాత సాధారణంగా ఎవరైనా పదవీ విరమణ గురించి ఎదురు చూస్తూ వుంటారు.
అయితే ఆ వయసులోనే ఆమె పర్వతారోహణ చేయాలని ప్రతినబూనింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
"మేం హెచ్చు స్థాయికి చేరుకొనేటప్పుడు 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది.
ఓ రకంగా అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించడానికి ఒక సాహస యాత్రనే చేశాం." అని జ్యోతి చెప్పింది.
"""/"/
కాగా, ఆ సమయంలో వాతావరణం బాగోలేక దాదాపు 2 రోజులు బేస్ క్యాంప్ లోనే ఉన్నారట.
ఆ సమయంలో కూడా ఆమె ఆశ ఏమాత్రం సడలలేదు.ఆ తరువాత వాతావరణం మెరుగుపడడంతో ఆమె శిఖరానికి చేరుకుందట.
ఇకపోతే జ్యోతికి ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు.పర్వతారోహణ కోసం దేశంలోని వివిధ శిక్షణా కేంద్రాలతో మాట్లాడిందట.
40 ఏళ్లు దాటినవారికి ఎలాంటి శిక్షణ అందుబాటులో లేదని అందరూ నిరాకరించారట.దీంతో ఆమే సొంతంగా శిక్షణ ప్రారంభించుకుంది.
ఇంట్లోనే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ భోపాల్ లో చిన్న చిన్న ట్రెక్ లకు వెళ్లడం చేసేదట.
మొదట అమె ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు నవ్వినా ఇపుడు అమె సాధించిన విజయం చూసాక శెభాష్ అంటున్నారు.
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చే సినిమా ఇదేనా..?