అమెరికాలో ఘనంగా మొదటి తెలుగు మహిళా అసోసియేషన్

అమెరికాలో తెలుగు సంఘాలకి కొదవలేదు.ప్రాంతానికి తగ్గట్టుగా అక్కడ ఉండే తెలుగు వారు వివిధ రకాలుగా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు.

వీరి ముఖ్య ఉద్దేశ్యం తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు కాపాడటం, అదేవిధంగా తెలుగు ని భవిష్యత్తు తరాలకి పరిచయం చేయడం, అమెరికాలో ఉండే తెలుగు వారికి ఎలాంటి సాయాన్ని అయినా అందించడం.

ఇప్పటి వరకూ అమెరికాలో కేవలం మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయబడిన సంఘాలు మచ్చుకకి ఒక్కటి కూడా లేవు.

దాంతో అమెరికాలో తెలుగు మహిళల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో ఘనంగా ఏర్పాటు చేయబడుతున్న సంస్థ WETA( Women Empowerment Telugu Association ).

ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం తెలుగు మహిళల సమస్యలపై సత్వరమే స్పందించడం.వారి అభివృద్దికి తోడ్పడటం.

ఈ సంస్థ కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణం డా .ఝాన్సీరెడ్డి .

"""/"/  ఈ సంస్థ నిన్నటి రోజున మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎంతో ఘనంగా ప్రారంభించ బడింది.

ఈ కార్యక్రమాన్ని కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో నిర్వహించారు.ప్రముఖ సినీ నటి సుమలత ముఖ్య అతిదిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ప్రారంభం అయిన తరువాత బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు