ప్రపంచ కప్ కు క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్..!!
TeluguStop.com
క్రికెట్ చరిత్రలో మొదటిసారి ప్రపంచ కప్ కు వెస్టిండీస్ జట్టు(West Indies ) అర్హత సాధించలేకపోయింది.
గతంలో రెండు సార్లు ప్రపంచ కప్ నెగ్గిన కరీబియన్లు.త్వరలో జరగబోయే వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై కాకపోవడం క్రీడా ప్రపంచంలో అందరికీ షాక్ కి గురిచేసింది.
అర్హత టోర్నీలో స్కాట్లాండ్ చేతిలో వెస్టిండీస్ ఓటమిపాలైంది.జింబాబ్వే( Zimbabwe )లో జరుగుతున్న వరల్డ్ కప్ అర్హత టోర్నీ(ODI World Cup 2023 )లో సూపర్ సిక్స్ మ్యాచ్ లో వెస్టిండీస్.
స్కాట్లాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.వెస్టిండీస్ జట్టులో బలమైన బ్యాట్స్ మ్యాన్ లు ఉన్న గాని స్కాట్లాండ్ బౌలర్ లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేయడం జరిగింది.
మొదటి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 181 పరుగులు చేయగా తర్వాత రెండో బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ 182 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ప్రపంచ క్రికెట్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ప్రతీ టోర్నీలో వెస్టిండీస్ ఆడింది.
కానీ ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై కాకపోవటం ఇదే ప్రథమం.
రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు.ఈ రీతిగా అర్హత సాధించలేకపోవటం కూడా ఇదే మొదటిసారి.