అక్కడ పెళ్లికి వెళ్లాలంటే దాన్ని స్కాన్ చేయాల్సిందేనట!

భారతీయ సంప్రదాయాలలో వివాహానికి( Marriage ) పెద్ద పీట వేయడం జరిగింది.అందుకే భారతీయులు తమ వివాహాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు.

పెళ్లి వేడుకని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని మనలో దాదాపుగా అందరూ కలలు కంటూ వుంటారు.

ఇక మనలో కొంతమంది అనుకుంటారు.తమ వివాహాన్ని వెరైటీ చేసుకుందామని.

ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు తన పెళ్లికార్డుతో( Wedding Card ) అందరినీ మెస్మరైజ్ చేసాడు.

కాగా వారి వెరైటీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

"""/" / విషయం ఏమంటే ఈ యువకుడు పాన్ కార్డు మాదిరి వెడ్డింగ్ కార్డు తయారు చేయించాడు.

ముందు భాగంలో ఇద్దరి ఫొటోలు, పేర్లు, డేట్ ఉండగా వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ను( QR Code ) పెట్టారు.

పెళ్లి ముహూర్త సమయం, వేదిక, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందేనట! ఏటీఎం కార్డు సైజులా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో( West Godavari ) వైరల్గా మారింది.

"""/" / విషయం ఏమిటంటే, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి - శిరీషల పెళ్లి సెప్టెంబర్ 2న జరగనుండగా వారి పెళ్లి కార్డుల్ని అందరిలా కాకుండా కాస్త వెరైటీగా రెడీ చేయించారు.

పాన్ కార్డు టైపులో ఉండి.దానిపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు.

ఇక్కడ కొసమెరుపు ఏమంటే, వారి పెళ్లికి రావాలనుకునేవారు ఈ కోడ్ ను స్కాన్ చేయాల్సిందేనట.

ఎందుకంటే, స్కాన్ చేస్తేనే పెళ్లి వేదిక సహా అన్నీ వివరాలు తెలుస్తాయి.ఈ విషయంపై పెళ్లికొడుకు సోదరుడు స్పందిస్తూ.

బెంగళూరులో ఈ కార్డు తయారుచేయించినట్లు తెలిపారు.దాంతో గోదారోళ్ల రూటే సపరేట్ అంటూ గోదారి బిడ్డలు స్టైల్ కొడుతున్నారు మరి.

మరి ఈ ఐడియా మీకు నచ్చితే సింపుల్ గా కాపీ కొట్టేయండి మరి.

ఆక్సిజన్ మాస్క్ తో సినిమా షూటింగ్.. సమంత కష్టాలకు కన్నీళ్లు పెట్టిన హీరో?