పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అట్టహాసంగా ప్రారంభమైన , పేకాట, కోడి పందాలు ..

సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో గుండాట, పేకాట, కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం మండలాల్లో కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయి.జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ లో పామాయిల్ తోట లో  కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

బరుల వద్ద అనధికారికంగా మద్యం అమ్మకాలు  సాగుతున్నాయి.పందాల రాయుళ్ల కొలహలంతొ బరులు తిరునాళ్లను తలపిస్తున్నాయి.

పోలీసులు రాజకీయ ఒత్తిడికి లొంగి పర్మిషన్ ఇవ్వడంతో పండగ మూడు రోజులు పందాలు భారీగా జరుగనున్నాయి.

ప్రభాస్ హను రాఘవ పూడి సినిమాలో నటించనున్న యంగ్ హీరో…