రూ.2వేల ఖర్చుతో రోబో తయారీ… అతిథి మర్యాదలు చేసేస్తుంది మరి!

అవును, మీరు విన్నది నిజమే.ఆ రోబో( Robot ) తయారు చేయడానికి కేవలం రూ.

2వేలు మాత్రమే ఖర్చు అయ్యాయి.అయితేనేం, అది ఏకంగా అతిథి మర్యాదలు చేసేస్తుంది.

పనికిరాని వస్తువులతో ఓ యువకుడు సదరు రోబోను తయారుచేయడం విశేషం.ఆహారం, నీళ్లు ఇలా ఇతర ఇంటిపనులు చేసేలా దాన్ని తీర్చిదిద్దాడు.

మరోవైపు, ఆ వ్యక్తి నిరుద్యోగుల కోసం ఓ యాప్​ తీసుకువచ్చాడు.యువతలోని ట్యాలెంట్​ను వినియోగదారుల వద్దకు చేర్చేలా టింగ్​ టాంగ్​ అనే యాప్​ను రూపొందించడం విశేషం.

"""/" / బెంగాల్ కు చెందిన దేబాశిష్ దత్తా అనే యువకుడు ఇంటికి వచ్చిన అతిథులకు( Guests ) ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసేలా ఆ మరమనిషిని రూపొందించడం విశేషం.

అవార్డు ఫంక్షన్లలో పురస్కారాలు సైతం ఇది ప్రదానం చేస్తుందని కూడా అతడు చెప్పడం విశేషం.

దేబాశిష్​ దత్తా.( Debashish Dutta ) సిలిగుడికిలో బాగ్డోగ్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు.

నగరంలోని పాలిటెక్నిక్​ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న దేబాశిష్​కు రోబోలంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం.

వాటిని తయారుచేయాలని కలల కనేవాడు.ఈ క్రమంలోనే దీనిని తయారుచేయగలిగాడు.

"""/" / అయితే దానిని అతగాడు ఒక్కరోజులో పూర్తి చేయలేదు.దాని వెనుక చాలా కృషి దాగివుంది.

వాటిని తయారు చేసేంత ఆర్థిక స్తోమత కూడా లేదు.అయినా పట్టువిడవకుండా ఇంట్లో పనికిరాని వస్తువులతో 2 నెలలు శ్రమించి ఓ రోబోను తయారుచేశాడు.

దానికి సీ-ప్రోగ్రామింగ్​ సహాయంతో.కోడింగ్ చేశాడు.

రోబోకు 'బిధు శేఖర్'​ అని పేరు పెట్టడం ఇక్కడ కొసమెరుపు.ఆ మరమనిషిని తయారు చేయడానికి 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పాడు దేబాశిష్​.

ఈ రోబో​కు నాలుగు చక్రాలు అమర్చి.బ్లూటూత్​తో అనుసంధానం చేశాడు దేబాశిష్.

అంతేకాకుండా రోబోను నియంత్రించడానికి రిమోట్ యాప్​ను రూపొందించాడు.మొబైల్ ఫోన్​లోని ఆ యాప్​ ద్వారా రోబోను కదిలించవచ్చు.

ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!