సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది

వ్యవసాయం( Agriculture) చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం రైతుల అభిప్రాయం మేరకే మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయంమంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం తోనే ఆగస్టు 15లోగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీచేస్తాంప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా: సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నేవూరి లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎల్లారెడ్డిపేట మండలానికి 117 వీర్నపల్లికి 34 కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం 18 గంటలు పనిచేస్తున్నారని 7 లక్షల కోట్ల అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రూప కల్పన చేస్తున్నారని ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు.

నిరుపేదలకు సహాయం అందించాలనే సదుద్దేశంతో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy _ప్రభుత్వం తులం బంగారం కూడా ఇచ్చి తీరుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహిళ మనులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణంకల్పించడం జరిగిందన్నారునిరుపేదల కుటుంబాలకు భరోసా కల్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనివల్ల పేదలు వ్యాధిని నయం చేసుకోవడం కోసం వివిధ ఆపరేషన్ల కోసం అప్పులు చేసుకొని వీధిపాలు కాకుండా ఉండేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడిందన్నారు రెండు లక్షల వరకు ఉన్న ఈ పథకాన్ని 10 లక్షల వరకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేస్తూ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు జీరో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని దీనిని 95% గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం జరిగిందన్నారు.

జీరో బిల్లు రావటం లేదని ఆందోళన పడవలసిన అవసరం లేదని 200 యూనిట్లు లోపు అర్హులైన వారి అందరికీ ఈ పథకం అమలు చేసి తీరుతామన్నారు.

ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఇచ్చాం ఈనాడు కూడా ఇస్తామన్నారు, ఇందిరమ్మ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ఒక్కొక్క లబ్ధిదారుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో 70 వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది అన్నారు,రైతులకు ఏకకాలంలో ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులందరికీ కొత్త రుణాలు తీసుకునే విధంగా రూపకల్పన చేసి పాసుబుక్కులు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు.

మంత్రి మండలిలో ఏకగ్రీవంగా తీర్మానం తీసుకొని ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నమన్నారు.

రైతుబంధును రైతు భరోసాగా మార్చడం జరిగిందని మంత్రిమండలి ఉప సంఘం రాష్ట్రంలో రైతుల అభిప్రాయాలను సేకరించి విధి విధానాలను రూపొందించి రైతుల పెట్టుబడి సహాయము దున్నేవాడికే భూమి అన్నట్టుగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందజేయడం జరుగుతుందన్నారు, వాగులకు వంకలకు కొండలక కోనలకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు.

ఎన్నికల హామీలో భాగంగా కార్మికులకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు, నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజాధనం వృధా కాకుండా ఆపివేసి పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారుసన్న రకం వడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ వానకాల పంటల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు .

అర్హులైన వారి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు అభివృద్ధి ఆపకుండా ముందుకు సాగుదాం అన్నారు.

మల్కపేట రిజర్వాయర్ నైన్త్ ప్యాకేజీ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించడానికి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రడ్ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామన్నారుఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీకు లోగా సాలరీ ఇచ్చినట్లే ఇకనుంచి రైతు భరోసా కూడా సకాలంలో రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి( Congress Party In-charge Is KK Mahender Reddy ) , జిల్లా నాయకులు గడ్డం నరసయ్య , ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ బోయిని రామచంద్రన్ వీర్నపల్లి డిప్యూటీ తహసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్ యాదవ్ , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ , షేక్ గౌస్ బాయి,పందిళ్ళ లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి మేడిపల్లి దేవానందం , శ్రీనివాస్ రెడ్డి , కొండాపురం బాల్రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి,ఒగ్గు బాలరాజు యాదవ్,కొత్తపల్లి దేవయ్య, గూర్రం రాములు , బండారి బాల్ రెడ్డి , నంది కిషన్ , నరసయ్య సూడిది రాజేందర్, బానోతు రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సస్పెన్స్‌కు తెరదించిన ట్రంప్ .. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా జేడీ వాన్స్