బుధవారం గణపతి పూజ చెయ్యడం వల్ల కలిగే ఫలితం ఇదే!

వినాయకుడికి ప్రథమ పూజలు అందుకునే దేవుడిగా మనం పూజిస్తాము.మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పని చేసినా ముందుగా గణపతి పూజ చేస్తాం.

దీనికి కారణం మనం చేసే పని నిర్విఘ్నంగా ఏ ఆటంకం లేకుండా జరగాలని గణపతిని వేడుకుంటాము.

గణపతికి బుధవారం ఎలా పూజలు చేయాలి? పూజ వల్ల కలిగే ఫలితం ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఏకదంతుడు, గజాననుడు, వక్రతుండ అని ఇలా పలురకాలుగా వినాయకుడిని పూజిస్తారు.బుధవారం ఉదయం స్నానమాచరించి మహాగణపతి పూజను చేయాలి.

వినాయక కు ఎర్రని మందారం పువ్వు అంటే ఎంతో ఇష్టమైనది.ఈ పూలతో పూజించడం ద్వారా వినాయకుని అనుగ్రహం కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి.

వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది గరిక.బుధవారం గరికను వినాయకునికి సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంటిల్లిపాది సుఖసంతోషాలను కలిగి ఉంటుంది.

బుధవారం వినాయకుడికి బూందీ లడ్డు, బెల్లం ఆవు నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి.అనంతరం ఈ నైవేద్యాన్ని ఆవులకి తినిపించడం ద్వారా ప్రత్యేక ఫలితాలు కలుగుతాయి.

వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాళ్ళు.ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామి వారి అనుగ్రహం కలిగి అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

బుధవారం వినాయకునికి రావి ఆకులు, సింధూరం సమర్పించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

వినాయకుడిలోని ఏనుగు తల ధైర్యాన్ని, సృజనాత్మకతను, అచంచల శక్తిని, జ్ఞానాన్ని సూచిస్తుంది.గణపతి చెవులు కళ్ళను తాకుతూ ఉంటాయి.

ఇవి స్త్రీ పురుష తత్వాల మధ్య సమన్వయాన్ని సూచిస్తుంది.వినికిడి స్త్రీ తత్వం, చూపు పురుష తత్వానికి సంబంధించినది.

ఈ రెండు చెవులు ప్రేమించే శక్తిని, కొత్తదనాన్ని స్వీకరించ కలుగుతాయి.గణపతి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలుగా పనిచేస్తాయి.

గణపతిలోని దంతాలు రాగ ద్వేషాలను సూచిస్తాయి.వినాయకుడి చిన్ని చిన్ని కళ్ళు దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడుతుంది.

అందుకోసమే మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి ఆశీర్వాదం తీసుకుంటాం.

Mudragada Padmanabham : ‘ముద్రగడ ‘ అసలు టార్గెట్ ఆయనేనా ? జగన్ అప్పగించిన బాధ్యత అదేనా ?