మాస్క్ లు ఎక్కువగా వేసుకుంటే కష్టం… కారణం ఏంటంటే?

కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచం అంతటా ఆయా దేశాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోవడం తప్పనిసరిగా ప్రకటించాయి.

మాస్క్ వేసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి, వేసుకున్న వ్యక్తికి ఆ వ్యాధి సోకకుండా ఆపవచ్చు.

కానీ కొంతమంది మాత్రం మాస్క్ తరచుగా వాడితే చాలా ప్రమాదం అని, ప్రాణహాని ఉందని చెప్తున్నారు.

మాస్క్ ఎక్కువగా వాడటం వల్ల కార్బన్ డయాక్సైడ్ కు ఎక్కువ (ఎక్స్ పోస్) అవుతామని, దీనివల్ల లైఫ్ రిస్క్ అని అంటున్నారు.

అసలు దీంట్లో నిజం లేదని తాజాగా జరిపిన పరిశోధనలో సైంటిస్ట్ లు తెలిపారు.

భారతదేశం లో ఇప్పుడు శీతాకాలం రాబోతుంది కాబట్టి కరోనా నుండి కొంచం ఎక్కువ ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలి అని వారు పేర్కొన్నారు.

భారతదేశం లో కరోనా వ్యాప్తి ఇప్పటికే విస్తరించింది.సుమారు లక్ష మందికి పైగా కరోనాకు బలి అయ్యారు.

వాక్సిన్ రావడానికి మరో 6 నెలలు పడుతుంది అని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సహాయం అందుతూనే ఉంది.

ఇంకెన్ని రోజులు ఈ మహమ్మారి నుండి మనను మనం కాపాడుకోవాలో అని ప్రజలు బాధపడుతున్నారు.

బింబిసార 2 కి దర్శకుడు ఎవరో తెలుసా..?