జగన్ ఆదేశాల మేరకు పని చేస్తాం..: మంత్రి తానేటి వనిత
TeluguStop.com
ఏపీలోని వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పని చేస్తామని తెలిపారు.
సేవలు ఇక చాలని జగన్ చెప్తే హ్యాపీగా పార్టీ కోసం పని చేస్తామని మంత్రి తానేటి వనిత అన్నారు.
దానికి ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పారు.పార్టీ మారాలనుకుంటే అది వారి పర్సనల్ వ్యవహరమని పేర్కొన్నారు.
అయితే ఎవరికి ఎలా న్యాయం చేయాలో సీఎం జగన్ కు తెలుసని స్పష్టం చేశారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025