సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి మరోవైపు చేపడుతాం – బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పనులు మరోవైపు చేపట్టడం జరుగుతుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయి, అభివృద్ధి పనులు చేయరు, సంక్షేమ కార్యక్రమాలు చేయరు అని ప్రతిపక్షాలు ఎన్నో రకాల అబద్ధపు ప్రచారాలు చేశారని అట్టి ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

అట్టి అబద్ధపు ప్రచారాలను పటా పంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.

ఉపాధి హామీ పనుల కింద ఎల్లారెడ్డిపేట మండలంలో ఐదు గ్రామాలకు 24 లక్షలు మంజూరు చేశారనీ సిసి రోడ్ల నిర్మాణాలకు అక్కపళ్లి గ్రామానికి 5 లక్షల రూపాయలు , బుగ్గ రాజేశ్వర్ తండా గ్రామపంచాయతీకి మూడు లక్షలు , దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీకి 3 లక్షలు వెంకటాపూర్ కు 5 లక్షలు ,నారాయణపూర్ కు 8 లక్షలు సిసి రోడ్డు పనులు మంజూరు చేయడం జరిగిందని అట్టి పనులను సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భూమి పూజలు చేసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు.

పనులు కూడా ప్రారంభించడం జరిగిందని అట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.

అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు పగడ్బందీ ప్రణాళికలు అధికారులతో కలిసి రూపొందిస్తున్నామని అవసరం ఉన్నచోట పైపులైన్లు బోరు బావులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతుందని రెండు గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని మరో రెండు గ్యారెంటీలు ఇస్తామని మరో రెండు మార్చిలోపు అమలుచేసి తీరుతామన్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చేసి చూపెడతామని ఆయన అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పందిల్ల లింగం గౌడ్ , కిసాన్ మండల అధ్యక్షులు గుండాడి రాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు రాజు నాయక్ , కొత్త పల్లి దేవయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , రఫీక్ , గుర్రపు రాములు , గంట బుచ్చగౌడ్, చెరుకు ఎల్లయ్య యాదవ్ , రామచంద్రం నాయక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా: నాని