కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతాం..: ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయాలను శాసించే సత్తా ముదిరాజ్ లదని తెలిపారు.

గజ్వేల్ లో ముదిరాజ్ ఓట్లతోనే సీఎం కేసీఆర్ గెలిచారని ఎమ్మెల్యే ఈటల పేర్కొన్నారు.

ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు.సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

కేసీఆర్ ను గద్దె దించుతామని ముదిరాజ్ జాతి ప్రతినపూనిందని వెల్లడించారు.